విజయశాంతి రీ ఎంట్రీ అందుకే ఆలస్యమైందా?
Send us your feedback to audioarticles@vaarta.com
లేడీ అమితాబ్, రాములమ్మ దాదాపు 13 ఏళ్ల తర్వాత వెండితెరపై కనపడబోతున్నారు. సూపర్‌స్టార్ మహేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. ఇందులో విజయశాంతి భారతి అనే ప్రొఫెసర్ పాత్రలో నటిస్తున్నారు. అయితే నిజానికి విజయశాంతితో సినిమా చేయాలని దర్శకుడు అనిల్ రావిపూడి అనుకున్నాడు. కానీ కుదరలేదట.
అసలు విషయమేమంటే..అనిల్ రావిపూడి దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన చిత్రం `రాజా ది గ్రేట్`. ఈ సినిమాను ముందుగా రామ్‌తో తెరకెక్కించాలని అనుకున్నాడట అనిల్ రావిపూడి. రామ్ తల్లి పాత్రలో ముందుగా విజయశాంతిని అనుకున్నాడట. విజయశాంతిని కలిసి కథను కూడా చెప్పాడట. ఆమె కూడా ఓకే అందట. అయితే చివరకు రామ్ ఆ ప్రాజెక్ట్‌ను చేయనని చెప్పాడట. చివరకు ఆ సినిమాను రవితేజ చేయడానికి ఓకే చెప్పాడు. రవితేజ తల్లిగా చేయడానికి విజయశాంతి ఒప్పుకోలేదు. ఆ సమయంలోనే అనిల్‌తో మంచి పాత్ర కుదిరితే మరో సినిమా చేస్తానని విజయశాంతి చెప్పారట. చివరకు మహేశ్ సినిమాలో మంచి పాత్ర దక్కడంతో నటిస్తానని చెప్పారట. అలా విజయశాంతి రీ ఎంట్రీ కాస్త ఆలస్యమైంది.
మహేశ్, రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన `సరిలేరు నీకెవ్వరు` సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది. ఇందులో విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com