రోడ్డు మీద నడిచినా డబ్బులు వసూల్ చేస్తారా కేసీఆర్.. బంగారు తెలంగాణ అంటే ఇదేనా?: విజయశాంతి
Send us your feedback to audioarticles@vaarta.com
కల్వకుంట్ల కుటుంబం చేసిన దుబారా ఖర్చులకు సామాన్యులు బాధపడాల్సి వస్తోందన్నారు తెలంగాణ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి. అభివృద్ధి పేరుతో అంకెల గారడి చేసిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు... అనవసరంగా అప్పులు చేస్తున్నారని ప్రతిపక్షాలు హెచ్చరించిన పట్టించుకోలేదన్నారు. పైగా ప్రతిపక్ష నేతలపై కేసులు పెడతామని బెదిరించారని మండిపడ్డారు. అప్పుడు వాళ్లు చేసిన పాపాలే ఇప్పుడు తెలంగాణ ప్రజల పాలిట శాపంగా మారాయన్నారు.
ఇన్నాళ్లు అంకెల గారడి చేస్తూ వచ్చిన కేసీఆర్ తెలంగాణ ఆర్టీసీ సమ్మెను కారణంగా చూపి చార్జీలు పెంచేశారని విమర్శించారు విజయశాంతి. ఆ తర్వాత నిత్యావసర సరుకుగా ఉన్న పాల ధర పెంచిన సీఎం .. ఇప్పుడు కరెంటు చార్జీలను కూడా అమాంతంగా పెంచేందుకు రంగం సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయన్నారు. అంటే సామాన్యుడి నడ్డి విరిచి వారి నుంచి డబ్బులు వసూల్ చేస్తే తప్ప ప్రభుత్వాన్ని నడిపలేని దుస్థితిలో సీఎం దొరగారు ఉన్నారని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వాలకాన్ని చూస్తే... భవిష్యత్తులో సామాన్యుడు రోడ్డు మీద నడిచినా డబ్బులు వసూల్ చేస్తే కానీ ప్రభుత్వాన్ని నడపలేమని చేతులెత్తేసేలా ఉందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పరిభాషలో బంగారు తెలంగాణ అంటే ఇదేనేమో అని చురకలు అంటించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout