చిరు ఆ మాట అన్నప్పుడు నాకు పదింతల మర్యాద..: విజయశాంతి
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేష్ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్‌టైనర్ ’సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్ విజయశాంతి నటిస్తున్నారు.జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్నివిడుదల చేస్తున్నారు. కాగా ’సరిలేరు నీకెవ్వరు’ మెగాసూపర్ ఈవెంట్ జనవరి 5న హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ స్టేడియంలో అశేష అభిమానుల సమక్షంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొని ‘సరిలేరు నీకెవ్వరు’ ట్రైలర్‌ని విడుదల చేసిన చిత్రాబృందానికి ఆల్‌దిబెస్ట్ చెప్పి.. నటీనటుల గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే.
చిరు ఆ మాట అనడంతో..!
కాగా.. ఈ వేడుకలో విజయశాంతి-చిరంజీవి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. సుమారు 10 నిమిషాల పాటు వీరి మధ్య జరిగిన ఈ సంభాషణే ఈ ఈవెంట్‌కు హైలెట్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే.. ఈ సంభాషణపై తాజాగా విజయశాంతి ఫేస్‌బుక్‌లో మరోసారి స్పందించింది. ‘నటనా పరమైన ప్రశంసల వల్ల లభించే సంతోషం ఒకటైతే.. కమర్షియల్ సినిమాల విజయంతో సాధించే స్టార్డం ఇమేజ్ వల్ల అందుకునే ఆనందం ఇంకొకటి. ఈ రెండూ కళాకారులను అత్యంత ప్రభావితం చేయగలిగే అంశాలే అన్నది నా అభిప్రాయం. జాతీయ ఉత్తమ నటిగా నేను అవార్డు తీసుకున్న సందర్భంలో ఎంత గౌరవంగా భావించానో... నటనకు డిక్షనరీ లాంటి మహానటుడు శివాజీ గణేషన్ గారు నన్ను "గ్రేట్ ఆర్టిస్ట్, నా దత్తపుత్రిక" అని సంబోధించినప్పుడు అంతకుమించి గౌరవంగా భావించాను.
అలాగే కమర్షియల్ సినిమాల పరంగా ఎన్ని విజయాలు సాధించినా... లేడీ సూపర్‌స్టార్, లేడీ అమితాబ్ లాంటి అభినందనలు పొందినా... ఆ మాటను తెలుగు సినిమాను కమర్షియల్ పరంగా, కలెక్షన్ల పరంగా అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పడంతో ఆ పదాలకు ఒక విలువ, పదింతల మర్యాద లభించినట్లుగా భావిస్తున్నాను. సాధారణంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇలాంటి ప్రశంసలు అందుకోవడం ఆనవాయితీ. కానీ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఫంక్షన్ లోనే మెగాస్టార్ ద్వారా నేను అభినందనలు అందుకోవడానికి అవకాశం కల్పించిన సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి కృతజ్ఞతలు. "సరిలేరు నీకెవ్వరు" దర్శకుడు రావిపూడి గారితో పాటు... మొత్తం చిత్ర యూనిట్‌కు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను’ అని విజయశాంతి ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout