చిరు, బాలయ్య తో పోటీపడనున్న లేడీ అమితాబ్?

  • IndiaGlitz, [Tuesday,May 10 2016]

ఒక‌ప్పుడు అటు చిరంజీవికి, ఇటు బాల‌కృష్ణ‌కి హిట్ పెయిర్‌గా రాణించిన ఘ‌న‌త‌ని సొంతం చేసుకుంది లేడీ అమితాబ్ విజ‌య‌శాంతి. ఇప్పుడు అదే చిరు, బాల‌య్య‌తో ఆమె పోటీప‌డ‌నుందా? అవున‌నే వినిపిస్తోంది టాలీవుడ్ లో. చిరంజీవి న‌టిస్తున్న 150వ చిత్రం 'క‌త్తిలాంటోడు', బాల‌కృష్ణ న‌టిస్తున్న 100వ చిత్రం 'గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి' సంక్రాంతి కానుక‌గా విడుద‌ల‌య్యే దిశ‌గా ఉన్న‌ సంగ‌తి తెలిసిందే.

ఇద్ద‌రు ప్ర‌ముఖ క‌థానాయ‌కుల ల్యాండ్ మార్క్ చిత్రాలు ఒకే సీజ‌న్ లో రావ‌డ‌మే ఒక విశేషంగా మారితే.. అదే రోజున వారిద్ద‌రికి హిట్ పెయిర్ గా నిలిచిన విజ‌య‌శాంతి క‌మ్ బ్యాక్ ఫిల్మ్ కూడా రిలీజ్ అయ్యే అవ‌కాశ‌ముంద‌ని ఫిల్మ్‌ న‌గ‌ర్ లో వినిపిస్తోంది. చాలా కాలం త‌రువాత విజ‌య‌శాంతి న‌టించ‌నున్న ఆ చిత్రం ద‌స‌రాకి ప్రారంభ‌మై.. శ‌ర‌వేగంగా నిర్మాణం జ‌రుపుకుని సంక్రాంతికి విడుద‌ల‌వుతుంద‌ని క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ మూడు సినిమాలు అనుకున్న టైంకి అనుకున్న‌ట్లుగా వ‌స్తే మాత్రం 2017 సంక్రాంతి క‌చ్చితంగా స్పెష‌లే.

More News

కుమారి ప్లేస్ లో రెజీనా...

కుమారి 21 ఎఫ్ చిత్రంతో కుర్రకారుకి దగ్గరైన కుర్రది హేబా పటేల్. ప్రస్తుతం నేను..నా బాయ్ ఫ్రెండ్స్ చిత్రంలో నటిస్తుంది. అలాగే రీసెంట్ గా స్టార్టయిన శ్రీనువైట్ల, వరుణ్ తేజ్ సినిమా మిస్టర్ లో ఒక హీరోయిన్ గా ఓకే అయ్యింది.

అనుష్క క్లారిటీ ఇచ్చేసింది...

ప్రస్తుతం బాహుబలి కన్ క్లూజన్ చిత్రీకరణలో బిజీగా ఉన్న అనుష్క శెట్టి ఆ సినిమా పూర్తి కాగానే పిల్ల జమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో బాగ్ మతి సినిమాలో నటించనుంది. ఇటీవల సినిమా లాంచనంగా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

రవితేజ మిస్ కానున్నాడా?

2001లో వచ్చిన 'ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం'తో రవితేజకి తొలిసారిగా హీరోగా బ్రేక్ దొరికితే.. 2002లో వచ్చిన 'ఇడియట్' అతని కెరీర్ లో టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ఆ తరువాత రవితేజ రేంజ్ ఏమిటో అందరికి తెలిసిందే. ప్రతి ఏడాది కనీసం ఒక సినిమా నుంచి 4, 5 సినిమాల వరకు చేస్తూ మినిమమ్ గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.

'భైరవద్వీపం' బాటలో 'బాహుబలి 2'

22 ఏళ్ల కిత్రం విడుదలై సంచలన విజయం సాధించిన జానపద చిత్రం 'భైరవద్వీపం'. ఆ తరువాత మళ్లీ జానపద చిత్రాలలో ఘనవిజయం సాధించింది 'బాహుబలి' మాత్రమే. ఈ చిత్రానికి సీక్వెల్ గా 'బాహుబలి 2' రానున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ 'బాహుబలి 2', నాటి సంచలన చిత్రం 'భైరవ ద్వీపం'ని ఫాలో కాబోతోంది.

ఆ విధంగా 'అ..ఆ..' అతనికి స్పెషలే

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఎనిమిదవ చిత్రం 'అ..ఆ..'. నితిన్, సమంత తొలిసారిగా జోడీకట్టిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ మరో హీరోయిన్ గా నటించింది. మిక్కీ జే మేయర్ సంగీతంలో విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది.