Vijayashanthi:కాంగ్రెస్‌లో అలా చేరారో లేదో.. విజయశాంతికి కీలక బాధ్యతలు..

  • IndiaGlitz, [Saturday,November 18 2023]

మాజీ ఎంపీ విజయశాంతి నిన్న(శుక్రవారం) కాంగ్రెస్ పార్టీలో అలా చేరారో లేదో ఇవాళ ఆమెకు కీలక పదవి అప్పగించారు. పార్టీ ప్రచార, ప్లానింగ్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్‌గా విజయశాంతిని అధిష్టానం నియమించింది. కన్వీనర్లుగా సమరసింహారెడ్డి, పుష్పలీల, మల్లు రవి, కోదండరెడ్డి, నరేందర్‌రెడ్డి, యరపతి అనిల్‌, రాములు నాయక్‌, పిట్ల నాగేశ్వరరావు, ఒబేదుల్లా కొత్వాల్‌, రమేష్‌, పారిజాతరెడ్డి, సిద్దేశ్వర్‌, రామ్మూర్తి నాయక్‌, అలీ బిన్‌ ఇబ్రహీం, దీపక్‌ జాన్‌లకు చోటు కల్పించింది. కొత్త, పాత నేతల కలయిగా ఈ కమిటీలను నియమించారు.

కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆమె హస్తం కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాములమ్మ మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమేనని స్పష్టం చేశారు. కేసీఆర్‌ను ఫాంహౌస్‌కే పరిమితం చేయాలన్న లక్ష్యంతోనే తాను కాంగ్రెస్‌లో చేరానని తెలిపారు. అయితే బీజేపీపై ఎలాంటి విమర్శలు చేయకపోవడం గమనార్హం. ఆమెకు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ ఎంపీ సీటు ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

బండి సంజయ్ స్థానంలో కిషన్‌ రెడ్డి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బీజేపీపై ఆమె తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఆ సమయంలో తెలంగాణ వ్యతిరేకులతో వేదిక పంచుకోవాల్సి వచ్చిందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని ఉద్దేశించి ఆమె ట్వీట్ చేయడం కలకలం రేపింది. అప్పట్లోనే పార్టీ మార్పుపై వార్తలు రాగా శుక్రవారం ఆమె కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. బీజేపీలో తనకు ప్రాధాన్యత దక్కడం లేదని భావించి రాజీనామా చేసిన రాములమ్మకు పార్టీలో చేరిన కొన్ని గంటల్లోనే హస్తం హైకమాండ్ కీలక పదవి కట్టబెట్టడంతో ఆమె అనుచరులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

More News

Purandeswari:ఏపీలో జనసేన-బీజేపీ కలిపి పోటీ చేస్తాయి: పురదేంశ్వరి

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని తెలిపారు.

Vijayashanthi:కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి.. కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు..

బీజేపీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ జాతీయాధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆమె హస్తం కండువా కప్పుకున్నారు.

Tiger Nageswara Rao:ఓటీటీలోకి వచ్చేసిన 'టైగర్ నాగేశ్వరరావు.. ఎందులో స్ట్రీమింగ్ అంటే..?

మాస్‌ మహారాజ రవితేజ తొలిసారి పాన్ ఇండియా హీరోగా నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' డివైడ్ టాక్ తెచ్చుకుని ఓ మోస్తరు విజయంతో సరిపెట్టుకుంది.

Bigg Boss Telugu 7 : ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం రచ్చ.. ప్రశాంత్‌ , శోభాశెట్టిపై శివాజీ చిందులు.. ఆ టాస్క‌లో విజేత ఎవరు..?

బిగ్‌బాస్ తెలుగులో ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం పోరు నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ ఇచ్చే ట్విస్టులకు కంటెస్టెంట్స్‌తో

Naga Chaitanya:మంచి మనసు చాటుకున్న చైతూ.. నెటిజన్ల ప్రశంసలు

అక్కినేని హీరో నాగచైతన్య మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. నవంబర్ 14న జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని