‘సరిలేరు నీకెవ్వరు’పై రాములమ్మ ఆసక్తికర పోస్ట్..
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్‌లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి.. రాజకీయాల్లోకి వెళ్లి పెద్దగా రాణించలేకపోయి.. లేడీ అమితాబ్ విజయశాంతి అలియాస్ రాములమ్మ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒకట్రెండుకాదు దాదాపు 13 ఏళ్ల తర్వాత రాములమ్మ రీ ఎంట్రీ ఇచ్చింది. సూపర్‌స్టార్ మహేశ్ బాబు-రష్మిక మందన్నా నటీనటులుగా అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’తో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తవ్వగా.. 2020 సంక్రాంతికి ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో విజయశాంతికి సంబంధించి ‘సూర్యుడివో.. చంద్రుడివో..’ సాంగ్‌లో ఆమె మెరిసింది!. అయితే ఇంతవరకూ ఆమె పాత్ర రివీల్ కాలేదు కానీ.. తాజాగా ఫేస్‌బుక్‌లో ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది.
రాములమ్మ పోస్ట్ ఇదీ...!
‘మనం భారతీయులం
సరిలేరు మనకెవ్వరు
సంప్రదాయంగా.. సంస్కృతి ధర్మపరంగా..
ఇది మన దేశం నేర్పిన విధానం
ఆ ఉన్నత విలువలతో కూడిన ఒక చక్కని సందేశాత్మక చిత్రంగా మీ ముందుకు వస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం టైటిల్ నెంబర్ నేటి సాయంత్రం 5:04 గంటలకు విడుదల కానుంది. జనవరి 5, 2020వ తేదీన ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ సందర్భంగా మన సినిమాను అభిమానంతో స్వాగతిస్తున్న ప్రజలకు, అభిమానులకు గౌరవ అతిథులకు ధన్యవాదాలతో.. మీ విజయశాంతి’ అని రాములమ్మ తన ఫేస్‌బుక్‌లో ఆసక్తికర పోస్ట్ పెట్టి పిన్ టూ టాప్ చేసింది. ఈ పోస్ట్‌ను మహేశ్ వీరాభిమానులు.. విజయశాంతి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున షేర్ చేస్తూ.. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com