NKR21 మూవీలో విజయశాంతి.. కొత్త సినిమా పూజా కార్యక్రమం..
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి హీరో కల్యాణ్ రామ్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. బింబిసార హిట్‌తో మంచి ఊపు మీదున్న కల్యాణ్.. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఇప్పటికే 'డెవిల్' సినిమాతో బిజీగా ఉన్న ఆయన.. తాజాగా తన 21వ సినిమాకు పచ్చ జెండా ఊపాడు. నేడు హైదరాబాద్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సినిమాలో విశేషం ఏంటంటే లేడి సూపర్ స్టార్ విజయశాంతి ముఖ్యమైన పాత్రలో నటించబోతున్నారు. మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి కొంచెం గ్యాప్ తీసుకొని ఇప్పుడు కళ్యాణ్ రామ్ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల మందుకు రాబోతున్నారు.
పూర్తి యాక్షన్ రోల్‌లో కల్యాణ్ రామ్..
అశోకా క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాలో కల్యాణ్ రామ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ నటిస్తుంది. నారా రోహిత్, నందమూరి తారకరత్న ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘రాజా చెయ్యి వేస్తే’ సినిమాకు దర్శకత్వం వహించిన ప్రదీప్ చిలుకూరి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు. కాంతార, విక్రాంత్ రాణా, విరూపాక్ష, కిరాక్ పార్టీలకు మ్యూజిక్ అందించిన అంజనీష్ లోక్‌నాథ్ ఈ మూవీకి సంగీతం అందించనున్నాడు. ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ పూర్తి యాక్షన్ రోల్‌లో కనిపించబోతున్నట్లు మూవీ యూనిట్ తెలిపింది.
మద్రాస్ ప్రెసిడెన్సీ నేపథ్యంలో తెరకెక్కుతున్న 'డెవిల్'..
ఇక కల్యాణ్ రామ్ 'డెవిల్' సినిమా విషయానికొస్తే.. ఇప్పటికే విడుదలైన మూవీ టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. అలాగే ఫస్ట్ సింగిల్ ‘మాయ చేశావే’ సైతం ప్రేక్షకులను కట్టిపడేసింది. ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాట వింటేజ్ ఫ్లేవర్‌ను తలపించింది. 1940లోని మద్రాస్ ప్రెసిడెన్సీ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. అందుకు తగ్గట్లే ఆనాటి కాలం సెట్టింగ్స్, కాస్ట్యూమ్స్ తీర్చిదిద్దుతున్నారు. భారీ బడ్జెట్‌తో అభిషేక్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల మందుకు 'డెవిల్' మూవీ రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments