చిరుకు అక్కగా రాములక్క.. జరిగేపనేనా!?
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ సీనియర్ నటి కమ్ కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి అలియాస్ రాములమ్మ గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఒకట్రెండు కాదు ఏకంగా 13 ఏళ్లకుపైగా సినిమాలకు దూరమై రాజకీయాలకు రాణించాలని భావించిన రాములమ్మ పరిస్థితి.. ‘అనుకొన్నదొక్కటి.. అయినది ఒక్కటి’ అన్న చందంగా మారిపోయింది. దీంతో నటనపై మక్కువతో సూపర్‌స్టార్ మహేశ్ బాబు-అనిల్ రావిపూడి సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’తో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్టవ్వడం.. పైగా అందులో ఆమెకు కీలక పాత్ర కావడంతో ఇక రాములమ్మ రంగంలోకి దిగిపోయిందని అందరూ భావించారు. అయితే సడన్‌గా ఇకపై సినిమాల్లో నటించలేనని.. దయచేసి తనకు సెలవివ్వండి అని అప్పట్లో ట్వీట్ చేసి హడావుడి చేశారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఓ బంపరాఫర్ వచ్చిందని టాక్.
అప్పుడు ఆచార్య.. ఇప్పుడు లూసీఫర్!?
వాస్తవానికి మళ్లీ కలిసి నటిద్దాం.. మన జోడి గురించి మరిచిపోయావా..? అని ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి ఇద్దరూ మాట్లాడారు. అయితే అదే మాట ఇప్పుడు నిజమవ్వబోతోంది.. కాంబో రిపీట్ అవ్వబోతోంది. అయితే.. రాములమ్మ హీరోయిన్‌గా కాదండోయ్.. చిరంజీవికి అక్కగా అట. ప్రస్తుతం సోషల్ మీడియాలో.. ఇటు ప్రముఖ వెబ్ సైట్లలో ఇందుకు సంబంధించి వార్తలు పెద్ద ఎత్తున దర్శనమిస్తున్నాయి. వాస్తవానికి..‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత రాములక్క ఏ సినిమాలో నటిస్తోందన్న దానిపై ఇప్పుడు ఇండస్ట్రీలో సర్వత్రా ఆసక్తికర చర్చ జరిగింది. సూపర్ హిట్ జోడిగా పేరున్న చిరు-విజయశాంతి.. కొరటాల శివ ‘ఆచార్య’చిత్రంలో కలిసి కనిపించబోతున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే అవన్నీ పుకార్లేనని ఆ తర్వాత తేలిపోయాయి.
జరిగే పనేనా..!?
తాజాగా.. మలయాళంలో మంచి విజయం సాధించిన ‘లూసిఫర్’ రీమేక్‌లో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒరిజనల్ చిత్రంలో మోహన్‌లాల్‌కు సోదరిగా మంజు వారియర్ నటించగా.. రీమేక్‌లో చిరంజీవికి సోదరిగా విజయశాంతిని అనుకుంటున్నట్లుగా టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించబోయే సుజిత్, నిర్మాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సంప్రదించనున్నారని తెలుస్తోంది. అయితే చిరు సరసన ఎన్నో సినిమాల్లో హీరోయిన్ నటించి సూపర్ హిట్ జోడీ అనిపించుకున్న రాములమ్మ.. అక్కగా నటించాలంటే.. మిగతా హీరోలకు అయితే ఓకే కానీ.. చిరుకు అంటే అస్సలు అది జరిగే పనేనా..? పాత్ర మాత్రం చాలా మంచిగానే ఉంటుంది మరి.. రాములమ్మ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది..? ఒప్పుకుంటుందా లేకుంటే అస్సలు కుదరదనే తేల్చేస్తుందా..? వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments