విజయ సేతు పతి, రాశీ ఖన్నీ జంటగా ‘విజయసేతుపతి’

  • IndiaGlitz, [Monday,November 04 2019]

విజయ సేతు పతి, రాశీ ఖన్నీ జంటగా విజయా ప్రొడక్షన్ వారి నిర్మాణంలో తమిళంలో నిర్మాణమవుతున్న ‘సంగతమిళ్’ మూవీ ని హార్షిత మూవీస్ వారు తెలుగులో ‘విజయసేతుపతి’ పేరుతో విడుదల చేయనున్నారు. రెండు భాషల్లో నవంబర్ 15న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. సౌత్ లో సెల్ఫ్ మేడ్ స్టార్స్ లో విజయ సేతుపతి స్థానం ప్రత్యేకంగా నిలుస్తుంది. ‘సైరా’తో నేరుగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన విజయ సేతుపతికి తెలుగులో మంచి ఆదరణ ఉంది. త్వరలోనే ఆ ఆదరణ ‘విజయసేతుపతి’ తో మరింత పెరుగుతుందని చిత్ర యూనిట్ అంటుంది. త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా చేసేందుకు నిర్మాతలు నిర్ణయించారు. విజయసేతుపతి తో పాటు చిత్రయూనిట్ అందరూ అంటెండ్ అవుతారు.

ఈ సందర్భంగా నిర్మాత రావురి వి. శ్రీనివాస్ మాట్లాడుతూ: ‘‘అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ‘విజయ్ సేతుపతి ’ తెలుగు ప్రక్షేకుల ఆదరణ పొందుతుంది అని నమ్ముతున్నాను. విజయ్ సేతుపతి సినిమాను తెలుగులో రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. రాశీఖన్నా,నాజర్ , నివేద పేతురాజ్, అశుతోష్ రాణా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయిన వారే కావడం తో ఈ సినిమా స్ట్రైయిట్ సినిమాగానే ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఈ సినిమా లో యాక్షన్ సన్నివేశాలకు ప్రత్యేకమైన ప్రశంసలు దక్కుతాయి’’ అన్నారు.

నటీ నటులు: విజయసేతుపతి, రాశీఖన్నా, నివేద పేతురాజ్, నాజర్, అశుతోష్ రాణా,రవికిషన్
శుక్లా, తులసి తదితరులు