Vijayakanth:విజయ్‌కాంత్ సినిమాలతో బ్లాక్‌బస్టర్స్ కొట్టిన తెలుగు స్టార్స్.. ఏయే సినిమాలంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
కోలీవుడ్ సీనియర్ నటుడు, డీఎండీకే అధినేత విజయ్‌కాంత్ గురువారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. మధుమేహం, శ్వాస సంబంధిత అనారోగ్యంతో గత కొద్దిరోజులుగా చెన్నైలోని మియాట్ ఇంటర్నేషనల్ (ఎంఐవోటీ ఇంటర్నేషనల్) హాస్పిటల్‌లో ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం విజయ్ కాంత్ తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కెప్టెన్ మృతితో తమిళనాడు విషాదంలో కూరుకుపోయింది. ఆయన మరణం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. సినీనటుడిగా, రాజకీయ నాయకుడిగా తమిళ ప్రజలపై విజయ్ కాంత్ చెరగని ముద్ర వేశారు.
మూడున్నర దశాబ్ధాల సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన ఆయన.. తమిళంలో తప్పించి మరో భాషా చిత్రంలో నటించకపోవడం విశేషం. కానీ కెప్టెన్ నటించిన సినిమాలు దక్షిణాది భాషల్లో డబ్ అయి బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. అలా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఆయనకు వీరాభిమానులుగా మారిపోయారు. మన తెలుగులోనూ విజయ్ కాంత్ నటించిన సినిమాలు డబ్ అయ్యాయి. అంతేకాదు.. మన టాలీవుడ్ స్టార్స్ ఆయన సినిమాలను రీమేక్ చేసి భారీ విజయాలను అందుకున్నారు. అవేంటో ఒకసారి చూస్తే :
చిరంజీవి ఠాగూర్‌కు మూలం విజయ్‌కాంత్ రమణ :
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటైన ఠాగూర్ సినిమాకు మూలం తమిళంలో విజయ్ కాంత్ నటించిన రమణ. లంచం, అవినీతి కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్న చిరంజీవి స్టార్‌డమ్‌ను మరింత పెంచింది. తొలుత విజయ్ కాంత్, ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో రమణ వచ్చింది. దీనిపై మనసుపడ్డ చిరంజీవి.. తెలుగు నేటివిటీకి తగినట్లుగా మార్పులు చేశారు. వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఠాగూర్ సూపర్ హిట్‌గా నిలిచింది.
ఒక్క రమణే కాదు.. గతంలో విజయ్ కాంత్ చేసిన సినిమాలను చిరంజీవి తెలుగులో రీమేక్ చేశారు. వీటిలో సత్తం ఓరు ఇరుత్తరై .. తెలుగులో ‘‘చట్టానికి కళ్లు లేవు’’గా రీమేక్ అయ్యింది. ఈ రెండు చిత్రాలకు కోలీవుడ్ స్టార్ హీరో, విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకుడు. అలాగే ‘‘వెట్రి’’ని చిరంజీవి ‘దేవాంతకుడు’గా తీశారు. దీనికి కూడా ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకుడు. మరో బ్లాక్ బస్టర్ ఖైదీ నెంబర్ 786కి మూలం విజయ్ కాంత్ నటించిన ‘‘అమ్మన్ కోయిల్ కళిక్కలే’.
ఇక మిగిలిన స్టార్స్ విషయానికి వస్తే.. విజయ్ కాంత్ నటించిన ‘నన్నే రాజా నన్నే మంత్రి’ని 1987లో దాసరి నారాయణ రావు దర్శకత్వంలో మోహన్ బాబు ‘‘నేనే రాజు నేనే మంత్రి’’గా రీమేక్ చేశారు. అలాగే మోహన్ బాబు నటించిన ‘నా మొగుడు నాకే సొంతం’’ సినిమాకు మూలం ‘‘ఎన్ పురుషన్ థాన్ ఎనక్కు మట్టుమ్ థాన్’’ . ఇక తెలుగు నాట రీమేక్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా గుర్తింపు తెచ్చుకున్న వెంకటేశ్ కూడా విజయ్ కాంత్ సినిమాలను రీమేక్ చేశారు. విజయశాంతితో కలిసి ఆయన నటించిన ‘చినరాయుడు’కి విజయ్ కాంత్ హిట్ మూవీ ‘చిన్నగుండర్’ మూలం.
వీరితో పాటు డాక్టర్ రాజశేఖర్ .. తమిళంలో విజయ్ కాంత్ నటించిన ‘వెనైత పోలా’ను తెలుగులో ‘మా అన్నయ్య’ పేరుతో రీమేక్ చేశారు. ఆంధ్రుల అందాల నటుడు శోభన్ బాబు కూడా తమిళంలో విజయ్ కాంత్ నటించిన ‘‘నినైవే ఓరు సంగీతం’’ ఆధారంగా తెలుగులో ‘దొంగ పెళ్లి’ సినిమాను తీశారు. కెప్టెన్ నటించిన ‘వైదేగి కతిరుంతాల్’’ను తెలుగులో ‘‘మంచి మనసులు’’గా భానుచందర్ రీమేక్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments