మహేశ్ మూవీలో యాక్టింగ్‌కు 'రాములమ్మ' కోటిన్నర డిమాండ్!
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేశ్ బాబు త్వరలో అనిల్ రావుపూడి దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో 'గీత గోవిందం' మూవీ హీరోయిన్ రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుండగా.. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మేలో సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఇక అసలు విషయానికొస్తే.. మహేశ్ సినిమాలో అలనాటి స్టార్ హీరోయిన్, లేడీ సూపర్‌స్టార్ కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి అలియాస్ రాములమ్మ నటిస్తారని సమాచారం. ఈ సినిమాలో రాములక్క ఓ కీలక పాత్రలో పోషిస్తోందని తెలుస్తోంది. కాగా.. ఈ మహేశ్ మూవీలో నటించాలని చిత్రబృందం సంప్రదించగా మరోమాట చెప్పకుండా రాములక్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే రెమ్యునరేషన్ మాత్రం భారీగా డిమాండ్ చేసిందని వార్తలు వినవస్తున్నాయి. పవర్ఫుల్ పాత్ర గనుక విజయశాంతి అడిగినంత ఇచ్చేందుకు నిర్మాతలు కూడా రెడీ అయ్యారని తెలుస్తోంది.
సో.. ఇదే నిజమైతే రాములమ్మ సినిమాల్లోకి రీ- ఎంట్రీ ఇవ్వడం పక్కా అన్న మాట. కాగా విజయశాంతి స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సూపర్ డూపర్ హిట్లు తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడంలో రాములక్క తర్వాతే ఎవరైనా.. అంటే ఏ రేంజ్లో నటించేవారో అర్థం చేసుకోవచ్చు.
ఈమె నటించిన ఒసెయ్ రాములమ్మ, కర్తవ్యంతో పాటు పలు సినిమాలు ఎప్పటికీ జనాల్లో గుర్తుండిపోతాయ్. అందుకే ఆమెకు లేడీ సూపర్‌స్టార్ అని బిరుదు కూడా దక్కిందన్న మాట. సినిమాలకు గుడ్ బై చెప్పేసి రాజకీయాల్లో రాణిస్తున్న రాములక్క రీఎంట్రీ ఎలా ఉంటుందో అని అభిమానులే కాదు.. నటీనటులు ఎంతగానే ఆతురతగా వేచి చూస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com