ప్రమాణానికి సిద్ధమైన విజయసాయి.. కన్నా వాట్ నెక్స్ట్!?
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ 20 కోట్ల రూపాయిలకు అమ్ముడుపోయాడని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. దీనికి మళ్లీ కౌంటర్‌గా కన్నా స్పందించడం.. కౌంటరిస్తూ కాణిపాకం మీద ప్రమాణం చేసి నిరూపించాలని సవాల్ విసిరారు. ఇందుకు తాజాగా విశాఖపట్నం వేదికగా విజయసాయి స్పందించారు.
మొత్తం బయటపెడతా సుజనా..!?
‘నాకు తెలిసి నేను ఎక్కడ అవినీతికి పాల్పడలేదు.. దీనిపై కాణిపాకం లేదా నా ఆరాధ్య దైవం వేంకటేశ్వరుని సాక్షిగా ప్రమాణం చేస్తాను. కన్నా, సృజన అవినీతికి పాల్పడలేదని దేవుడి మీద ప్రమాణం చేస్తారా..?. కొన్ని వందల బోగస్ కంపెనీలు సృష్టించి వేల కోట్లు రుపాయలు బ్యాంక్‌లకు ఎగ్గొట్టి దీవాలా తీశాడు. సృజనకు సంబంధించిన కంపెనీల్లో ఎన్ని బోగస్ కంపెనీలు ఉన్నాయి..? ఆయన బినామీలు ఎవరు..? ఆయన ఎలా దొంగ టర్నోవర్లు సృష్టించి బ్యాంక్‌లు నుంచి వేల కోట్లు ఎలా తీసుకున్నాడో ఆధారాలతో సహా బయట పెట్టగలను. గతంలో నేను కూడా సృజనా చౌదరికి ఆడిటర్‌గా పనిచేశాను’ అని విజయసాయి కీలక వ్యాఖ్యలు చేశారు.
కన్నా, పురందేశ్వరీ ఇద్దరిపైనా..
‘కన్నా లక్ష్మి నారాయణ ఓ అవినీతి పరుడు. గత ఎన్నికలుకు బీజేపీ అధిష్ఠానం ఎంత ఇచ్చింది..? దానిలో మీరు ఎంత తీసుకున్నారు..?. మీ పార్టీ మహిళా నేత పురంధేశ్వరి ఎంత తీసుకుంది..? మీరు ఎలా దుర్వినియోగం చేసారో అన్ని నాకు తెలుసు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. నేను మళ్లీ.. మళ్లీ చేపుతున్న కన్నా 20 కోట్లకు అమ్ముడు పోయాడు. ఆ 20 కోట్లు బీజేపీ ఇచ్చిన డబ్బులు ఎం చేసారో చెప్పాలి..?. మీలాంటి వారు ప్రశ్నించడానికి అనర్హులు. ప్రగతి భారత్ ట్రస్ట్ ద్వారా సేవలు చేస్తున్నాము. మేము ప్రజలు దగ్గర దోచుకోవడం లేదు అంత ఖర్మ పట్టలేదు. చాలా మంది నా మీద, వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాం అంటూ విమర్శిస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చాక వ్యక్తిగతం వేరుగా ఉండదనేది నా అభిప్రాయం’ అని విజయసాయి తేల్చిచెప్పారు.
రియాక్ట్ అవుతారా..?
మొత్తానికి చూస్తే.. ఇప్పటి వరకూ కన్నాపైనే మాట్లాడిన విజయసాయి ఈసారి ఏకంగా బీజేపీ ఎంపీ సుజనా చౌదరి, మహిళా నేత పురందేశ్వరిపై కూడా ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు పక్కాగా ఆధారాలున్నాయని.. ప్రమాణం చేసి మరీ నిరూపిస్తానంటున్నారు. మరి ఆయన తాజా చాలెంజ్, వ్యాఖ్యలపై సుజనా, కన్నా.. మరీ ముఖ్యంగా పురందేశ్వరి ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments