మా లోకం.. పత్తిగింజనని చెప్పుకుంటారు: విజయసాయి
Send us your feedback to audioarticles@vaarta.com
వైసీపీ ప్రభుత్వం పంచిన ‘సన్న బియ్యం’పై టీడీపీ హడావుడి చేస్తున్న సంగతి తెలిసిందే. సన్న బియ్యం ప్యాకేట్లు ఓపెన్ చేసినట్లున్న వీడియోలు, ఫొటోలను మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ తన ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఆయనతో పాటు పలువురు టీడీపీ నేతలు సైతం ఈ వీడియోలను షేర్ చేయడం మొదలెట్టారు. తాజాగా ఈ వ్యవహారంపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందించారు. నారా లోకేశ్‌ను ఉద్దేశించి విజయసాయి వరుస ట్వీట్స్ చేశారు.
గంట లోపలే క్షుద్ర దాడి!
‘మాలోకం, ఆయన టీం ఉన్మాదంతో రెచ్చిపోతున్నారు. పేదలకు నాణ్యమైన బియ్యం ఇవ్వాలనే ఆశయంతో పైలట్ ప్రాజెక్టును శ్రీకాకుళం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. ఆ బియ్యం బస్తాల్లో నీళ్లు పోసి గడ్డకట్టిన బియ్యం ఇస్తారా..? అంటూ గంట లోపలే క్షుద్ర దాడి మొదలు పెట్టారు పచ్చ దొంగలు. @naralokesh’ అని విజయసాయి ట్వీట్ చేశారు.
‘గాలి’ మాటల నుంచి కాదు!
‘ఉద్దానం చుట్టూ అద్దె విమానాల్లో ఎగిరిన వ్యక్తి ఇప్పుడు అక్కడేం జరుగుతుందో చూడలేక కళ్లు మూసుకున్నాడు. 200 పడకల కిడ్నీ రీసెర్చి సెంటర్ వస్తోంది. మెట్రోలలో తప్ప రాష్ట్రాల రాజధానుల్లో కూడా లేని సదుపాయం. ఉక్కు సంకల్పం నుంచి పుట్టుకొచ్చింది. ‘గాలి’ మాటల నుంచి కాదు. @AndhraPradeshCM’ అని విజయసాయి సెటైర్ల విసిరారు.
పత్తిగింజనని చెప్పుకుంటారు..!
‘బాసేమో 18 కేసుల్లో స్టే తెచ్చుకుని తాను పత్తిగింజనని చెప్పుకుంటారు. బానిసలేమో పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నారు. పేదలకు నాణ్యమైన బియ్యాన్నిపంపిణీ చేస్తే కూడా జీర్ణించుకోలేక పోతున్నారు. మూడు పూటలా ఇసుక బొక్కినోళ్లకు రేషన్ బియ్యం నాణ్యత ఏం తెలుసు? @ncbn @JaiTDP’ అని విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శల వర్షం కురిపించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments