విజయసాయి.. రుజువు చేస్తే సర్కార్‌కే రాసిస్తా!!

  • IndiaGlitz, [Friday,August 23 2019]

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సీజన్ అయిపోయింది.. ప్రభుత్వం కూడా ఏర్పాటైందనుకుంటే.. అస్సలు ఎన్నికల సీజన్ ముందున్న కాక ఏ మాత్రం తగ్గలేదు. వైసీపీ ఎమ్మెల్యేలు 151, ఎంపీలు 22 మంది ఉన్నా.. మేం ఏ మాత్రం తగ్గేది లేదని టీడీపీ.. మాకేమీ లేకున్నా మేం కూడా తగ్గమని బీజేపీ.. సర్కార్‌పై యుద్ధానికి దిగుతున్నాయి. చిన్నపాటి అవకాశాలు వచ్చినా సరే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. చేజార్చుకోకుండా వెంటనే మీడియా ముందుకు వచ్చి నేతలు దుమ్ముదులిపి వదులుతున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా.. కృష్ణా నది వరద, రాజధాని తరలింపుపై ఏపీలో పెనుదుమారమే రేగుతోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం అధికార పార్టీ వైసీపీ-ప్రతిపక్షాలు టీడీపీ, బీజేపీల మధ్య చిచ్చు పెట్టింది. ఇరు పార్టీలకు చెందిన మీడియా ముఖంగా.. సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. అంతేకాదు.. సవవాళ్లు విసురుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా చేసిన ఓ ట్వీట్‌కు టీడీపీ ఎంపీ కేశినేని రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా రుజువు చేస్తే మొత్తం సర్కార్‌కే రాసిస్తానంటూ సవాల్ విసిరారు.

విజయసాయి ట్వీట్ ఇదీ...
అమరావతి నుంచి రాజధానిని తరలించేందుకే ముంపుకు గురిచేశారని గగ్గోలు పెడుతున్నవారెవరో గమనించారా? చంద్రబాబు, సుజనా, కేశినేని, సిఎం రమేశ్, లోకేశ్, కోడెల, ఉమ, వీళ్ల బినామీలు, ‘కావాల్సిన’ వాళ్లు వేల ఎకరాల భూములు రైతులను మోసం చేసి కొన్నారు. రియల్ ఎస్టేట్ ధరలు పడిపోతాయన్నదే వీరి ఏడుపు అని విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు టీడీపీకి చెందిన పలువురు నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ స్ట్రాంగ్ కౌంటర్లిచ్చారు.

కేశినేని ట్వీట్ ఇదీ..!
విజయసాయిరెడ్డి గారు నాకు గానీ.. నా కుటుంబానికి కానీ నాకు సంబంధించిన వారికి కాని అమరావతి

More News

తిరుమలలో అన్యమత ప్రచారం.. వైఎస్ జీవో చూడు జగన్!

తిరుమల ఆర్టీసీ టికెట్లపై అన్యమత ప్రచారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే.

కోడెలే కాదు చంద్రబాబు కూడా సర్కార్‌ సొమ్ము దాచిపెట్టారు!

గత మూడ్రోజులుగా ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అసెంబ్లీకి సంబంధించిన ఫర్నీచర్‌ను సొంత పనులకు వాడుకున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన విషయం విదితమే.

బన్నీ అరుదైన గుర్తింపు

ఉత్త‌రాది, ద‌క్షిణాది సినిమాలు, స్టార్‌హీరోల మ‌ధ్యనున్న అంత‌రాలు త‌గ్గుతున్నాయి. `బాహుబ‌లి`, `సాహో` వంటి మ‌న తెలుగు సినిమాలు కూడా బాలీవుడ్ భారీ రేంజ్‌లో విడుద‌ల‌వుతున్నాయి.

తొలి తెలుగు చిత్రంగా ప్రభాస్ `సాహో`

ఆల్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ఆగ‌స్ట్ 30న `సాహో`తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న సంగ‌తి తెలిసిందే.

తార‌క్ - త్రివిక్ర‌మ్ సినిమా ఎప్పుడంటే?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో సినిమా ఎప్పుడా అనే ఆస‌క్తి అభిమానుల్లో మొద‌లైంది.