విజయసాయి.. రుజువు చేస్తే సర్కార్‌కే రాసిస్తా!!
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సీజన్ అయిపోయింది.. ప్రభుత్వం కూడా ఏర్పాటైందనుకుంటే.. అస్సలు ఎన్నికల సీజన్ ముందున్న కాక ఏ మాత్రం తగ్గలేదు. వైసీపీ ఎమ్మెల్యేలు 151, ఎంపీలు 22 మంది ఉన్నా.. మేం ఏ మాత్రం తగ్గేది లేదని టీడీపీ.. మాకేమీ లేకున్నా మేం కూడా తగ్గమని బీజేపీ.. సర్కార్‌పై యుద్ధానికి దిగుతున్నాయి. చిన్నపాటి అవకాశాలు వచ్చినా సరే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. చేజార్చుకోకుండా వెంటనే మీడియా ముందుకు వచ్చి నేతలు దుమ్ముదులిపి వదులుతున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా.. కృష్ణా నది వరద, రాజధాని తరలింపుపై ఏపీలో పెనుదుమారమే రేగుతోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం అధికార పార్టీ వైసీపీ-ప్రతిపక్షాలు టీడీపీ, బీజేపీల మధ్య చిచ్చు పెట్టింది. ఇరు పార్టీలకు చెందిన మీడియా ముఖంగా.. సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. అంతేకాదు.. సవవాళ్లు విసురుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా చేసిన ఓ ట్వీట్‌కు టీడీపీ ఎంపీ కేశినేని రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా రుజువు చేస్తే మొత్తం సర్కార్‌కే రాసిస్తానంటూ సవాల్ విసిరారు.
విజయసాయి ట్వీట్ ఇదీ...
"అమరావతి నుంచి రాజధానిని తరలించేందుకే ముంపుకు గురిచేశారని గగ్గోలు పెడుతున్నవారెవరో గమనించారా? చంద్రబాబు, సుజనా, కేశినేని, సిఎం రమేశ్, లోకేశ్, కోడెల, ఉమ, వీళ్ల బినామీలు, ‘కావాల్సిన’ వాళ్లు వేల ఎకరాల భూములు రైతులను మోసం చేసి కొన్నారు. రియల్ ఎస్టేట్ ధరలు పడిపోతాయన్నదే వీరి ఏడుపు" అని విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు టీడీపీకి చెందిన పలువురు నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ స్ట్రాంగ్ కౌంటర్లిచ్చారు.
కేశినేని ట్వీట్ ఇదీ..!
"విజయసాయిరెడ్డి గారు నాకు గానీ.. నా కుటుంబానికి కానీ నాకు సంబంధించిన వారికి కాని అమరావతి
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments