'టీడీపీని చంద్రబాబు గొంతు పిసికి చంపేస్తున్నారు'

  • IndiaGlitz, [Tuesday,October 29 2019]

టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు.. సొంత పార్టీని గొంతు పిసికి చంపేస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో జరిగిన వైసీపీ సభలో ఆయన ప్రసంగిస్తూ.. చంద్రబాబు, నారా లోకేష్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అద్భుతంగా పాలన అందిస్తుంటే.. ఓ ముసలి నక్క, ఆయన కొడుకు యువనక్కకు కడుపు మంటగా ఉంది. ఆ ముసలి నక్క, యువ నక్క ఎవరో మీకు తెలుసు. 2014 నుంచి 2019 వరకు ఆ ముసలి నక్క సీఎంగా పనిచేసింది. ఐదేళ్లలో ఆ ముసలి నక్క సాధించలేదని.. ఈ ప్రభుత్వం ఐదు నెలల్లో సాధిస్తోందని కడుపు మంట. రాబోయే ఎన్నికల్లో ఆ ముసలి నక్క పోటీ చేసే పరిస్థితి లేదు. ఆ యువనక్క సమర్థత మీద ప్రజల్లో నమ్మకం లేదు. టీడీపీని చంద్రబాబు గొంతుపిసికి చంపేస్తున్నారు. మామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు... ఇప్పుడు పార్టీని గొంతు పిసికి చంపేస్తున్నారు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీని బీజేపీలో కలిపేస్తున్నారు. మరో ఇంట్లో బతకడానికి బాబు రెడీ అయ్యారు. అందుకు టీడీపీని పణంగా పెట్టారు. ఒకప్పుడు జాతీయ నాయకుడిగా ఉన్నచంద్రబాబునాయుడు ఇప్పడు ఒక ‘జాతి’ నాయకుడిగా మారిపోయారు’ అని విజయసాయి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

బాబే బీజేపీలోకి పంపారు!

టీడీపీకి టాటా చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకున్న రాజ్యసభ ఎంపీల గురించి మాట్లాడిన ఆయన.. సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటిలను చంద్రబాబే బీజేపీలోకి పంపారన్నారు. సుజనాచౌదరి నుంచి వల్లభనేని వంశీ వరకు పరిశీలిస్తే.. టీడీపీ భవిష్యత్ ఏంటో అర్థం అవుతుందన్నారు. చంద్రబాబు అసలు పుత్రుడు లోకేష్ మంగళగిరిలో ఒక్కచోట ఓడిపోతే, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ రెండు చోట్లా ఓడిపోయారని ఎద్దేవా చేశారు. జగన్ ప్రయోగించిన రామబాణానికి చంద్రబాబు ఐదు నెలల క్రితమే నేల కూలారని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు.

ఏ రాష్ట్రంలోనూ ఇన్ని అమలు కావట్లేదు!

‘పదేళ్ల పోరాటం తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఐదు నెలల పాలనలోనే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 80 శాతం హామీలన్నీ నెరవేర్చారు. తొలి అసెంబ్లీలోనే అన్ని వర్గాలకు మేలు చేసే 20 బిల్లులు ప్రవేశపెట్టడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్‌ ఇచ్చిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌కే దక్కింది. ఏ రాష్ట్రంలోనూ ఇన్ని సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంపై పక్క రాష్ట్రాలతో సఖ్యతగా ఉంటూ పరిష్కార మార్గాలకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. మహిళల సంక్షేమ కోసం సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. వచ్చే ఐదేళ్ల పాలనలో పేదలకు 25 లక్షల ఇళ్లు ఇస్తాం. అన్ని వర్గాలకు మేలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలి’ అని ఈ సందర్భంగా విజయసాయి కోరారు.

More News

సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం!

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం నాడు సమ్మె, కార్మికుల డిమాండ్లపై వాదానలు విన్న హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ లో కళ్యాణ్ రామ్ మరోసారి

డైన‌మిక్ హీరో నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ ఈ సంవత్సరం యాక్ష‌న్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ '118' తో భారీ విజయాన్ని అందుకున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో

మ‌రోసారి హాట్ టాపిక్‌గా మారిన పూన‌మ్ ట్వీట్‌

న‌టి పూన‌మ్ కౌర్ మ‌రోసారి వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలిచింది. అసెంబ్లీ ఎన్నికల ముందు ప‌రోక్షంగా జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ని, డైరక్ట‌ర్‌ని టార్గెట్ చేస్తూ కొన్ని మెసేజ్‌లు చేసింది.

'ఘంటసాల ది గ్రేట్' ట్రైలర్ ఆవిష్కరించిన చిత్ర

దక్షిణ భారత దేశమంతటా మారుమోగిన మహా గాయకుడు ఘంటసాల జీవితం తరువాతి తరాలకు కూడా తెలిసేలా చేసిన వెండితెర ప్రయత్నం 'ఘంటసాల ది గ్రేట్'.

హాలీవుడ్ స్టార్స్‌ను ప‌రుగులు పెట్టిస్తున్న కార్చిచ్చు

విల‌న్స్‌ను త‌మ ధైర్య సాహ‌సాల‌తో ప‌రుగులు పెట్టించే హాలీవుడ్ హీరోలు ఇప్పుడు భ‌యంతో ప‌రుగులు తీస్తున్నారు. ఇంత‌కు వారెందుకు ప‌రుగులు తీసున్నారో తెలుసా? దావాగ్ని కార‌ణంగా...