‘యజమాని ఆజ్ఞాపిస్తేనే బీజేపీ చుట్టూ ప్యాకేజీ స్టార్’
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును యజమానిగా.. పవన్‌ను ప్యాకేజీ స్టార్‌గా వ్యాఖ్యానించారు. ఇవాళ ట్విట్టర్ వేదికగా ఇరువురిపై ఆయన విమర్శల వర్షం కురిపించారు. ‘యజమాని ఆర్డరేస్తేనే ప్యాకేజీ స్టార్ బిజెపి చుట్టూ తిరుగుతున్నాడు. రాష్ట్ర బిజెపిని తన ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నంలో ముందుగా పావలాను పంపిస్తున్నాడు బాబు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కమలానికి పొత్తు వల్ల ఒరిగేదేమి లేకున్నా సైకిల్ పార్టీకి మేలు జరిగేలా చూసుకోవాలనేది బాబు ఎత్తుగడ’ అని విజయసాయి విమర్శించారు.
ఆఖరున ఎవరి దారి వాళ్లదే!
‘అమరావతిని ఎలా మారుస్తారని పళ్లు కొరికారు. ప్రభుత్వం కూలిపోతుందని శాపాలు పెట్టారు. ఉత్తుత్తి ఉద్యమాన్ని ప్రారంభించారు. బంగారు నగల సేకరణకు దిగారు. తర్వాత జోలెతో ఊరూరూ తిరుగుతున్నారు. ఆఖరున వచ్చిన డబ్బును పంచుకుని ఎవరి దారిన వాళ్లు వెళ్లి పోతారు’ అని వైసీపీ ఎంపీ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే.. విజయసాయి చేసిన ఈ వరుస ట్వీట్స్‌పై జనసేన కార్యక్తరలు, పవన్ ఫ్యాన్స్, టీడీపీ వీరాభిమానులు తీవ్ర స్థాయిలో కౌంటర్ల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు అంతే రీతిలో వైసీపీ ఫ్యాన్స్ కూడా అందుకు ప్రతి కౌంటర్లు, ప్రతి విమర్శలు గుప్పిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com