కరోనాతో విజయ ఆస్పత్రి డైరెక్టర్ మృతి

  • IndiaGlitz, [Sunday,June 21 2020]

చెన్నైలోని ప్రసిద్ధి గాంచిన విజయ ఆస్పత్రి డైరెక్టర్ శరత్ రెడ్డి(43) కరోనాతో చనిపోయారు. ఈ రోజు మధ్యాహ్నం విజయ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అధికారిక సమాచారం ప్రకారం.. శరత్ రెడ్డి ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన విజయ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. వైద్యులు ఆయనకు టెస్టులు చేయగా కరోనా అని తేలింది. వైద్యులు ఆయనకు చికిత్స అందించినప్పటికీ.. తీవ్ర అస్వస్థతతో చివరికి ఆయన కన్నుమూశారు. కాగా, చిత్రసీమలో ఎంతో గుర్తింపు ఉన్న చిత్రవాహిని స్టూడియోస్, ప్రొడ్యూసర్ బి నాగిరెడ్డి మనవడే ఈ శరత్ రెడ్డి. విజయ ఆస్పత్రి చైర్మన్‌గా శరత్ రెడ్డి తండ్రి విశ్వనాథ రెడ్డి కొనసాగుతున్నారు. అయితే శరత్ రెడ్డి మృతితో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది.

More News

నిజ ఘ‌ట‌న ఆధారంగా సినిమా అనౌన్స్ చేసిన వ‌ర్మ‌

నిజ ఘ‌ట‌న‌లు ఆధారంగా సినిమాలు చేయ‌డంలో రామ్ గోపాల్ వ‌ర్మ దిట్ట‌. 26/11 వంటి సినిమా ఆయ‌న తెర‌కెక్కించిన ఈ త‌ర‌హా చిత్రాల‌కు ఓ ఉదాహ‌ర‌ణ‌గా చెప్ప‌వ‌చ్చు.

ఈ సూర్యగ్రహణం కరోనాకు చెక్ పెట్టనుందా?

యోగా డేను కూడా మరిపించేలా దేశవ్యాప్తంగా రాహుగ్రస్త సూర్యగ్రహణం కొనసాగుతోంది. దాదాపు 4 గంటల పాటు ఉండే ఈ ఖగోళ అద్భుతం ఓ శుభవార్తను అందించింది.

తెలంగాణలో నిన్న ఒక్కరోజే 546 పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది.

కరోనా మహమ్మరికి ఔషధం సిద్ధం.. త్వరలోనే మార్కెట్‌లోకి..

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి ఔషధం సిద్ధమైంది.

గంగూలీ ఇంట కరోనా కల్లోలం.. నలుగురికి పాజిటివ్

బీసీసీఐ చీఫ్ గంగూలీ ఇంట్లో కరోనా కల్లోలం రేపింది. ఆయన కుటుంబంలో నలుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.