రజనీకాంత్ టైటిల్ తో హీరో విజయ్...
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ స్టార్ హీరో విజయ్ ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో రూపొందుతోన్న తన 61వ సినిమాలో నటిస్తున్నాడు. థెరి(తెలుగులో పోలీసోడు) తర్వాత విజయ్, అట్లీ కాంబినేషన్‌లో వస్తోన్న రెండో చిత్రమిది. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ దశలోనే ఈ సినిమాకు దళపతి అనే టైటిల్ పరిశీలనలో ఉందట. ఇదే టైటిల్‌తో రజనీకాంత్, అరవిందస్వామి, మణిరత్నం కాంబినేషన్లో వచ్చిన సినిమా సెన్సేషనల్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమాలో ఓ పాటను హీరో విజయ్ పాడనున్నాడని సమాచారం. ఈ చిత్రంలో సమంత, కాజల్ అగర్వాల్, నిత్యామీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com