'మా' సిల్వర్ జూబ్లీ మెమెంటో అందుకున్న నిర్మాత విజయ్‌వర్మ పాకలపాటి
Send us your feedback to audioarticles@vaarta.com
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఈ సంవత్సరం సిల్వర్ జూబ్లీ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా అసోసియేషన్‌లోని సభ్యుల పుట్టినరోజున వారిని ఆహ్వానించి సిల్వర్‌జూబ్లీ మెమెంటోను అందజేస్తున్నారు. ప్రముఖ నిర్మాత విజయ్‌వర్మ పాకలపాటి పుట్టినరోజు సందర్భంగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఇటీవల సిల్వర్‌జూబ్లీ మెమెంటోను అందజేసింది.
ఈ సందర్భంగా నిర్మాత విజయ్‌వర్మ పాకలపాటి మాట్లాడుతూ '' మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు నా కృతజ్ఞతలు. సిల్వర్‌జూబ్లీ సందర్భంగా సభ్యుల పుట్టినరోజున మెమెంటో అందిస్తున్నారు. 'మా' ప్రెసిడెంట్ శివాజీరాజాగారు మెమెంటో తీసుకోవాల్సింది నన్ను పర్సనల్‌గా ఆహ్వానించారు. ఈ మెమెంటోను శివాజీరాజా అన్నయ్య, బెనర్జీ అన్నయ్య, శ్రీరామ్‌గారు, నాగినీడుగారి చేతుల మీదుగా అందుకోవడం చాలా గౌరవంగా భావిస్తున్నాను'' అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com