Vijay : విజయ్ సినిమా టైటిల్ ఇదే.. క్లాసీ లుక్‌లో అదరగొట్టేస్తోన్న ఇళయ దళపతి
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన తెలుగు చిత్ర పరిశ్రమపై దేశంలోని అన్ని ఇండస్ట్రీల స్టార్లు ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్, మల్లూవుడ్ పరిశ్రమలకు చెందిన నటీనటులు తెలుగులో నటించడమో లేదంటే తెలుగు దర్శకులకు అవకాశం ఇవ్వడమో చేస్తున్నారు. దీనిలో భాగంగా తమిళ అగ్రనటుడు, ఇళయ దళపతి విజయ్ .. తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇది విజయ్ కెరీర్‌లో 66వ సినిమా కావడం విశేషం. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తుండగా.. రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. ‘మహర్షి’ వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు వున్నాయి.
అయితే ఈ సినిమా టైటిల్ ఏంటన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 22న విజయ్ పుట్టినరోజుని పురస్కరించుకుని చిత్ర యూనిట్ ‘టైటిల్’ పోస్టర్ రిలీజ్ చేసింది. ‘వారసి’ అనే టైటిల్ తో తమిళ్ లో ‘వారసుడు’ అనే టైటిల్ తో తెలుగులో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ పోస్టర్ లో విజయ్ .. సూట్‌లో క్లాసీ లుక్ లో అదరగొట్టేశారు. ఈ చిత్రంలో శ్రీకాంత్, సంగీత, శ్యామ్, ప్రకాశ్ రాజ్ , జయసుధ, యోగి బాబు, ప్రభు వంటి సీనియర్ ఆర్టిస్టులు నటిస్తున్నారు. ప్రస్తుతం చెన్నైలో సినిమా కోర్ టీమ్ పై కీలకమైన భారీ షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది. ఈ సందర్భంగా కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు
రేపు సుదర్శన్ 35లో ‘తుపాకీ’ సినిమా ప్రదర్శన:
ఇటీవల వచ్చిన విజయ్ సినిమా ‘బీస్ట్’ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన నేపథ్యంలో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అటు విజయ్‌కి తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. దీంతో ఆయన పుట్టిన రోజున హైదరాబాద్ ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ 35 ఎం.ఎంలో విజయ్ తెలుగు ఫ్యాన్స్ కోసం ‘తుపాకి’ సినిమాను ప్రదర్శించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments