చరణ్ కి పోటీగా విజయ్
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఇంటెలిజెంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం రంగస్థలం`. సమంత కథానాయిక. గ్రామీణ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ప్రేమ కథా చిత్రమిది. 1985 నాటి పరిస్థితులను అద్దం పట్టే విధంగా ఈ సినిమాని తెరకెక్కించినట్లు తాజాగా విడుదలైన టీజర్ బట్టి తెలుస్తోంది. ఈ మూవీలో చెర్రీ .. బధిరుడి పాత్రలో నటిస్తున్నారు. అలాగే సమంత మూగ అమ్మాయిగా నటిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక ఇదే రోజు మరో సినిమా రానుంది. అదే.. తమిళ అనువాద చిత్రం కాశి`. బిచ్చగాడు` సినిమాతో తెలుగులో మార్కెట్ ని పెంచుకున్న తమిళ నటుడు విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన చిత్రమిది. ఈ సినిమా కూడా గ్రామీణ నేపథ్యంలోనే తెరకెక్కడం విశేషం. ఇందులో విజయ్‌కి జోడీగా అంజలి, సునయన, అమృత, శిల్ప మంజునాథ్ నటించారు. కృతికా ఉదయనిధి దర్శకత్వం వహించారు. విజయ్ ఆంటోనీ సంగీతాన్ని అందించడమే కాకుండా.. స్వీయనిర్మాణంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. గ్రామీణ నేపథ్యం కలిగిన ఈ రెండు వైవిధ్యభరిత సినిమాలు ప్రేక్షకులను ఏ మాత్రం అలరించనున్నాయో తెలియాలంటే మార్చి 30 వరకు వేచి ఉండాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments