చరణ్ కి పోటీగా విజయ్

  • IndiaGlitz, [Friday,January 26 2018]

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఇంటెలిజెంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం రంగస్థలం'. సమంత కథానాయిక. గ్రామీణ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ప్రేమ కథా చిత్రమిది. 1985 నాటి పరిస్థితులను అద్దం పట్టే విధంగా ఈ సినిమాని తెరకెక్కించినట్లు తాజాగా విడుదలైన టీజర్ బట్టి తెలుస్తోంది. ఈ మూవీలో చెర్రీ .. బధిరుడి పాత్రలో నటిస్తున్నారు. అలాగే సమంత మూగ అమ్మాయిగా నటిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న‌ ఈ సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఇదే రోజు మ‌రో సినిమా రానుంది. అదే.. తమిళ అనువాద చిత్రం కాశి'. బిచ్చగాడు' సినిమాతో తెలుగులో మార్కెట్ ని పెంచుకున్న తమిళ నటుడు విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన చిత్ర‌మిది. ఈ సినిమా కూడా గ్రామీణ నేపథ్యంలోనే తెరకెక్క‌డం విశేషం. ఇందులో విజ‌య్‌కి జోడీగా అంజలి, సునయన, అమృత, శిల్ప మంజునాథ్ నటించారు. కృతికా ఉద‌య‌నిధి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. విజయ్ ఆంటోనీ సంగీతాన్ని అందించ‌డ‌మే కాకుండా.. స్వీయ‌నిర్మాణంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. గ్రామీణ నేపథ్యం కలిగిన ఈ రెండు వైవిధ్య‌భ‌రిత‌ సినిమాలు ప్రేక్షకులను ఏ మాత్రం అలరించనున్నాయో తెలియాలంటే మార్చి 30 వరకు వేచి ఉండాల్సిందే.

More News

కలకత్తాలో 20 రోజుల పాటు..

గతేడాది ‘శతమానం భవతి’,‘మహానుభావుడు’తో మంచి విజయాలను అందుకున్నారు యువ కథానాయకుడు శర్వానంద్.

తుదిదశ కు చేరుకున్న నితిన్ 25

యువ కథానాయకుడు నితిన్ 25 చిత్రాల మైలురాయికి చేరుకుంటున్న సంగతి తెలిసిందే.

మహేష్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం విడుదల

సూపర్ స్టార్ మహేష్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.

పాత‌బ‌స్తీ నేప‌థ్యంతో..

పోలీస్ పాత్రలకి, మాస్ మహారాజా రవితేజకి విడదీయరాని బంధం ఉంది. పోలీస్ కథలతో గతంలో ర‌వితేజ హీరోగా వచ్చిన 'వెంకీ', 'విక్రమార్కుడు', 'మిరపకాయ్', 'పవర్' వంటి సినిమాలు ఘన విజయం సాధించాయి.

వారిని టార్గెట్ చేసుకున్న తరుణ్

కుటుంబ సమేతంగా చూడ దగ్గ ప్రేమ కథా చిత్రాల్లో నటించి..