విజయ్ 'తెరి' తెలుగు టైటిల్
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ చలన చిత్ర పరిశ్రమ లో నే కాకుండా, తెలుగు రాష్ట్రాలలో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది సూపర్ స్టార్ విజయ్ నటించిన తమిళ చిత్రం తెరి`ని తెలుగులో పోలీసోడు పేరుతో ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, కలైపులి థాను విడుదల చేస్తున్నారు. 'రాజా రాణి' చిత్రం తో మంచి పేరు సంపాదించుకున్న అట్లి దర్శకత్వం లో ముస్తాబవుతోన్న ఈ సినిమాను ఏప్రిల్ 14న విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రం తెలుగు లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ద్వారా విడుదల అవుతుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం ఆడియో విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తారు. విజయ్ సరసన సమంత, ఎమీ జాక్సన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com