స్టార్ డైరెక్ట‌ర్స్‌కి షాకిచ్చిన విజ‌య్‌..!

  • IndiaGlitz, [Saturday,December 12 2020]

కోలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు విజ‌య్ ఇప్పుడిప్పుడే త‌న సినిమాల‌కు తెలుగులో మార్కెట్‌ను క్రియేట్ చేసుకునే ప‌నిలో ఉన్నాడు. ఈయ‌న హీరోగా చేసిన మాస్ట‌ర్ సినిమా విడుద‌ల‌కు రెడీ అయ్యింది. లాక్‌డౌన్ త‌ర్వాత ఇప్పుడే థియేట‌ర్స్‌కు అనుమ‌తులు ఇచ్చిన నేప‌థ్యంలో మాస్ట‌ర్ సినిమాను వ‌చ్చే ఏడాది విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో విజ‌య్ త‌దుప‌రి సినిమా ఏంటి? డైరెక్ట‌ర్ ఎవ‌రు? అనే దానిపై చాలా రోజుల క్లారిటీ రాలేదు. మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తాడ‌ని, కాదు అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తాడంటూ ఇలా చాలా వార్త‌లే వినిపించాయి.

అయితే అంద‌రికీ షాకిస్తూ విజ‌య్ కేవ‌లం రెండు సినిమ‌ల అనుభ‌వ‌మున్న‌ ద‌ర్శ‌కుడితో సినిమా చేయ‌డానికి ఓకే చెప్ప‌డం అంద‌రికీ షాకింగ్ విష‌యం.ఆ ద‌ర్శ‌కుడు ఎవ‌రో కాదు.. నెల్స‌న్ దిలీప్ కుమార్‌. నెల్స‌న్ న‌య‌న‌తార‌తో కోల‌మావు కోకిల విడుద‌లై సూప‌ర్‌హిట్ అయ్యింది. మ‌రో వైపు శివ‌కార్తీకేయ‌న్‌తో చేసిన డాక్ట‌ర్ సినిమా విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అంటే ఈ రెండు సినిమాల్లోనూ విడుద‌లైంది ఓ సినిమానే. బ‌డ్డింగ్ డైరెక్ట‌ర్ నెల్స‌న్‌కు విజ‌య్ అవ‌కాశం ఇవ్వ‌డం టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ అయ్యింది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది. అనిరుధ్ ర‌విచంద్ర‌న్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించ‌నున్నారు.

More News

రాజకీయంగా చర్చనీయాంశంగా.. అమిత్ షాతో కేసీఆర్ భేటీ..

తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

మ‌రోసారి వ్యాఖ్యాత‌గా ఎన్టీఆర్

సీనియ‌ర్ అగ్ర హీరోల్లో చిరంజీవి, నాగార్జున వెండితెర‌పైనే కాదు.. బుల్లితెర‌పై కూడా ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన సంగ‌తి తెలిసిందే.

హైదరాబాద్‌లో ప్రారంభమైన అమితాబ్‌ బచ్చన్‌–అజయ్‌ దేవగణ్‌ కాంబినేషన్‌లోని ‘మే డే’

బిగ్‌ బి అమితాబ్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న బాలీవుడ్‌ సినిమా ‘మే డే’. దీనికి ప్రముఖ బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్‌ దేవగణ్‌ దర్శకుడు,

అజయ్.. శ్రద్ధా దాస్.. ఆమని ప్రధాన తారలుగా సైకలాజికల్ థ్రిల్లర్ 'అర్థం' 

అజయ్, శ్రద్ధా దాస్, ఆమని ప్రధాన తారలుగా రూపొందుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ 'అర్థం'. ఈ చిత్రానికి 'నాటకం' చిత్రనిర్మాతల్లో ఒకరైన రాధికా శ్రీనివాస్ నిర్మాత.

రకుల్‌కు క్షమాపణలు చెప్పాల్సిందే

టాలీవుడ్‌ హీరోయిన్‌కు రకుల్‌ ప్రీత్‌సింగ్‌కు టీవీ ఛానెళ్లు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది.