తెలుగులో విజ‌య్ సేతుప‌తి, త్రిష '96'

  • IndiaGlitz, [Monday,September 10 2018]

త‌మిళంలో నేటి త‌రం హీరోల్లో వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకుంటున్న హీరో విజ‌య్ సేతుప‌తి ఒక‌రు. ఈయ‌న త్రిష‌తో న‌టించిన రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ '96'. ఇటీవ‌ల విడులైన ట్రైల‌ర్‌, పాట‌ల‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

సి.ప్రేమ్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో నంద‌గోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా హ‌క్కుల‌ను ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు ద‌క్కించుకున్నార‌ని స‌మాచారం.

ఈ సినిమాను రీమేక్ చేస్తారో లేక అనువాదం చేసి విడుద‌ల చేస్తారో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే. ఈ చిత్రానికి గోవింద్ మీన‌న్ సంగీతం అందించగా.. మ‌హేంద్ర‌న్ జ‌య‌రాజ్‌, ఎన్‌.ష‌ణ్ముగ సుంద‌రం సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.