మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విడుదల చేయనున్న 'A' ట్రైలర్!!
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం రాబోతున్న చిత్రాలలో "A" సినిమాపై అటు ప్రేక్షకుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోను భారీ ఎక్స్ పెక్టేషన్స్ నెలకొని ఉన్నాయి. అందరి అంచనాలకు ధీటుగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నితిన్ ప్రసన్న హీరోగా ప్రీతి అస్రాని హీరోయిన్ గా అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై యుగంధర్ ముని దర్శకత్వంలో గీతా మిన్సాల నిర్మించిన థ్రిల్లర్ చిత్రం “A”.
ఫిబ్రవరి 26న అత్యధిక థియేటర్స్ లలో వరల్డ్ వైడ్ గా విడుదల కానున్న ఈ చిత్రాన్ని పివి ఆర్ సంస్థ గ్రాండ్ గా రిలీజ్ చేయనుంది. అందులో భాగంగా చిత్ర యూనిట్ పబ్లిసిటీ ప్రమోషన్స్ ని విభిన్నంగా జరుపుతున్నారు.. చిత్ర యూనిట్. యువ ప్రతిభాశాలి విజయ్ కురాకుల అద్భుతమైన స్వరాలను సమకూర్చారు.. ఇప్పటికే విడుదలైన పాటకు శ్రోతలనుండి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.. కాగా ఈ చిత్రం ట్రైలర్ ని మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఫిబ్రవరి 5న విడుదల చేయబోతున్నారు.. విజయ్ సేతుపతి A ట్రైలర్ రిలీజ్ చేయడంపై చిత్ర యూనిట్ లో నూతనోత్సాహం నెలకొనివుంది..
సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ కె బంగారి (ఎస్ఆర్ఎఫ్టిఐ), సౌండ్ డిజైన్ బినిల్ అమక్కాడు (ఎస్ఆర్ఎఫ్టిఐ), సౌండ్ మిక్సింగ్ సినాయ్ జోసెఫ్ (నేషనల్ ఫిల్మ్ అవార్డ్ విన్నర్) మరియు ఎడిటింగ్ ఆనంద్ పవన్ & మణికందన్ (ఎఫ్టిఐఐ). సంగీతం విజయ్ కురాకుల. నిర్మాత; గీతా మిన్సాల, దర్శకత్వం; యుగంధర్ ముని.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com