సైరాలో విజ‌య్‌సేతుప‌తి లుక్‌..

  • IndiaGlitz, [Friday,October 12 2018]

మెగాస్టార్‌ చిరంజీవి టైటిల్‌ పాత్రలో..సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేందర్‌ రెడ్డి దర్శకుడిగా హై టెక్నికల్‌ వేల్యూస్‌తో.. అమితాబ్‌ బచ్చన్‌, నయనతార, తమన్నా, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు, సుదీప్‌ ప్రధాన తారాగణంగా మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ రూపొందిస్తోన్న భారీ బడ్జెట్‌తో చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. ప్ర‌స్తుతం జార్జియాలో యుద్ధ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌లో యూనిట్ ఫుల్ బిజీగా ఉంది. సైరా సైనికుల‌కు, ఈస్ట్ ఇండియా కంపెనీ సైనిల‌కు మ‌ధ్య జ‌రిగే యుద్ధాన్ని చిత్రీక‌రిస్తున్నారు సురేంద‌ర్ రెడ్డి.

దాదాపు వెయ్యి మందికి పైగా ఈ షెడ్యూల్‌లో స‌భ్యులు పాల్గొంటుండ‌గా.. స్పైడ‌ర్ కెమెరాల‌ను ఉప‌యోగించి స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఇందులో గోసాయి వెంక‌న్న పాత్ర‌లో అమితాబ్‌, అవుకురాజు పాత్ర‌లో కిచ్చా సుదీప్ లుక్స్ విడుద‌లైయాయి. తాజాగా కోలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు విజ‌య్ సేతుప‌తి లుక్ కూడా ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేస్తుంది. విజ‌య్ సేతుప‌తి పాత్ర పేరు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..