‘800’ నుంచి తప్పుకున్న విజయ్ సేతుపతి..

  • IndiaGlitz, [Monday,October 19 2020]

శ్రీలంక మాజీ క్రికెటర్, దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’ నుంచి తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి తప్పుకున్నారు. తన బయోపిక్ నుంచి వైదొలగాలంటూ విజయ్ సేతుపతికి మురళీధరన్ రిక్వెస్ట్ చేశారు. దీంతో విజయ్ సేతుపతి సినిమా నుంచి తప్పుకున్నారు. తన కారణంగా ఓ మంచి తమిళ నటుడు బాధపడకూడదని భావిస్తున్నానని మురళీధరన్ పేర్కొన్నారు. కెరీర్ పరంగా విజయ్‌కు సమస్యలు రాకూడదని ఆయన ఆశించారు. అందుకే విజయ్‌ను ఈ సినిమా నుంచి తప్పుకోవాలని కోరుతున్నట్టు పేర్కొన్నారు.

తన బయోపిక్ 800పై వచ్చిన వివాదాల నేపథ్యంలో తాను ఈ ప్రకటన చేస్తున్నానని మురళీధరన్ తెలిపారు. లేనిపోని అపోహలతో విజయ్ సేతుపతిపై కొందరు ఒత్తిడి తీసుకు వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. విజయ్ సేతుపతి స్థానంలో మరో నటుడిని నిర్మాతలు ఎంపిక చేస్తారని.. తన బయోపిక్ త్వరలోనే అభిమానులు, ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తుందని మురళీధరన్ ఆశాభావం వ్యక్తం చేశారు. మురళీధరన్ ప్రకటనపై విజయ్ సేతుపతి ట్విట్టర్ వేదికగా స్పందించారు. తాను ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు.

కాగా.. శ్రీలంక తమిళియన్ అయిన ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ ఆధారంగా ‘800’ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి టైటిల్ రోల్ పోషిస్తున్నట్టు ప్రకటించిన కొద్ది సేపటికే తమిళనాడులో వివాదం మొదలైపోయింది. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ప్రధాన మంత్రి మహింద్ర రాజ్‌పక్సేను గతంలో మురళీధరన్ సపోర్ట్ చేశారు. శ్రీలంకలో తమిళ పులుల అంతర్యుద్ధాన్ని అంతమొందించడం కోసం దాదాపు 30 ఏళ్ల పాటు కొన్ని లక్షల మంది తమిళులను ఊచకోత కోశారు. దీంతో మహింద్ర రాజ్‌పక్సేపై తమిళనాడులో తీవ్ర వ్యతిరేకత ఉంది. అలాంటి మహింద్ర రాజ్‌పక్సేను సపోర్ట్ చేయడంతో మురళీధరన్‌పై కూడా తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది.

More News

30 శాతం రెమ్యునరేషన్ తగ్గించుకోండి: భారతీరాజా

కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో తమిళ నిర్మాతల సంఘం అధ్యక్షుడు భారతీ రాజా నటీనటులకు ఒక సూచన చేశారు.

వందేళ్లకోసారి మాత్రం ఇలాంటి వర్షం పడే అవకాశం: కేటీఆర్

1908లో మూసీకి వరదలు వచ్చాయని.. నాడు ఒకే రోజు 43 సెంటీమీటర్లు వర్షం పడిందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

ఆ ట్వీట్‌ని బ్రహ్మాజీ ఎందుకు డిలీట్ చేశారు?

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే నటుల్లో బ్రహ్మాజీ ఒకరు. అభిమానుల ప్రశ్నలకు ఫన్నీ ఫన్నీగా సమాధానాలు ఇస్తూ అభిమానులకు చాలా దగ్గరగా ఉంటారు.

ప్రతిభావంతులను ప్రోత్సహించడానికి ‘డెక్కన్‌ మ్యూజిక్‌ ఛాలెంజ్‌’ ప్రారంభించిన శశి ప్రీతమ్‌, ఐశ్వర్య కృష్ణప్రియ

గాయనీ గాయకులను, బ్యాండ్స్‌ను వెలుగులోకి తీసుకు రావాలనే గొప్ప ఉద్దేశంతో సంగీత దర్శకుడు శశి ప్రీతమ్‌ సోమవారం నాడు ‘డెక్కన్‌ మ్యూజిక్‌ ఛాలెంజ్‌’ కాంపిటీషన్‌ ప్రారంభించారు.

నందమూరి బాలకృష్ణ 'నర్తనశాల' ఈ నెల 24న విడుదల

సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రాత్మక పాత్రలలో తండ్రికి ధీటైన తనయుడిగా, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు నటవారసుడిగా