విజయ్ సేతుపతి దెబ్బకు విలవిల్లాడుతున్న స్టైలిష్ విలన్!
Send us your feedback to audioarticles@vaarta.com
విజయ్ సేతుపతి.. ఈయనను హీరో అనాలా.. విలన్ అనాలా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనాలా..? అనేది తెలియడం లేదు కానీ ఈ తమిళనాడు డైనమేట్ మాత్రం టాలీవుడ్ ప్రముఖ నటుల గుండెల్లో పేలుతోంది. ఒకప్పుడు ప్రకాష్ రాజ్ అనగానే ఒక్క హీరో క్యారెక్టర్‌కి తప్ప ఏ క్యారెక్టర్‌కైనా ప్రాణం పోస్తారనే పేరుండేది. కానీ విజయ్ సేతుపతి విషయానికి వస్తే హీరోగా కూడా 100 పర్సెంట్ పర్ఫెక్ట్ అని అంటారెవరైనా. తమిళ్ సినిమా ‘96’ దీనికి ఉదాహరణ. ఈ సినిమాలో విజయ్ హీరోగా నటించాడు. ఈ సినిమాను చూసిన వాళ్లెవరూ విజయ్ సేతుపతిని మరచిపోలేరు. అంత అద్భుతంగా నటించాడు. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు.
ఇక విలన్‌గా కూడా విజయ్ సేతుపతిని కొట్టేవాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు. అందుకే తమిళ ప్రేక్షకులే కాదు.. తెలుగు ప్రేక్షకులు కూడా విజయ్‌ని గుండెల్లో పెట్టుకున్నారు. విజయ్ సేతుపతి కోసమే ప్రత్యేకంగా సినిమాకు వెళ్లేవాళ్లున్నారంటే ఆయన రేంజ్ ఏంటో అర్థమవుతోంది. ఇక ఈ తమిళ డైనమైట్ ప్రత్యేకంగా ఒక విలన్ గుండెల్లో పేలుతున్నాడనేది టాలీవుడ్ టాక్. ఇప్పటి వరకూ స్టైలిష్ విలన్‌గా పేరు తెచ్చుకున్న జగపతి బాబును రీ ప్లేస్ చేస్తున్నాడు. దీంతో ఫిల్మ్ మేకర్స్ కూడా జగపతిబాబుని పక్కనబెట్టి విజయ్ సేతుపతికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారనే టాక్ నడుస్తోంది. నిన్న మొన్నటి వరకూ విలన్ పాత్ర అనగానే జగపతిబాబు గుర్తొచ్చే వారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.
తెలుగునాట నేడు విజయ్ సేతుపతి దాదాపు అన్ని సినిమాల్లోనూ నటిస్తున్నాడు. ‘సైరా నర్సింహారెడ్డి’లో సైతం అవకాశం సంపాదించాడు. అది మొదలు ఈ నెల 12న వైష్ణవ్ తేజ్ హీరోగా విడుదల కాబోయే ‘ఉప్పెన’ సినిమా వరకూ.. అలాగే ఇక ముందు కూడా విజయ్ సేతుపతి సినిమాల పరంపర టాలీవుడ్‌లో కొనసాగనుంది. ఇక విజయ్ కారణంగానే జగపతిబాబుకు అవకాశాలు తగ్గిపోతున్నాయనే టాక్ బలంగానే వినిపిస్తోంది. అందుకే జగపతిబాబు ప్రయోగాలకు తెరదీస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తిరిగి హీరో అవతారమెత్తబోతున్నారని తెలుస్తోంది. విజయ్ సేతుపతి దెబ్బ తెలుగు ఇండస్ట్రీపై బాగానే పడే అవకాశం కనిపిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments