విజయ్ సేతుపతిపై దాడి.. బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో ఊహించని ఘటన
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ సినీ నటుడు విజయ్ సేతుపతిపై ఓ గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. బెంగళూరు ఎయిర్‌పోర్టులో సేతుపతికి ఈ చేదు అనుభవం ఎదురైంది. నిన్న రాత్రి ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. సేతుపతి, ఆయన టీమ్ నడుచుకుంటూ వస్తుండగా వెనుక నుంచి సదరు వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది దుండగున్ని వెంటనే పట్టుకున్నారు. అయితే అతనిపై కేసు నమోదు చేయవద్దని సేతుపతి చెప్పినట్టుగా తెలుస్తోంది.
అయితే దుండగుడి దాడిలో సేతుపతికి ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పుడు విజయ్ సేతుపతి అంటే కేవలం సౌత్ స్టార్ మాత్రమే కాదు.. బాలీవుడ్‌లోనూ ఆయన నటిస్తున్నాడు. వరుసగా ప్రాజెక్ట్‌లను పట్టాలెక్కిస్తున్నాడు. ప్రస్తుతం రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో విజయ్ నటిస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments