విజయ్ సేతుపతి.. వివాదం
Send us your feedback to audioarticles@vaarta.com
మక్కల్ సెల్వన్.. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి పుట్టినరోజు నేడు( జనవరి 16). సోషల్ మీడియా వేదికగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ సంక్రాంతికి విజయ్‌తో ఆయన కలిసి నటించిన మాస్టర్ ఆయనకు చాలా మంచి పేరుని కూడా తెచ్చి పెట్టింది. అంతా హ్యాపీ కదా! అని అనుకుంటున్న సమయంలో ఆయన చేసిన ఓ పని వల్ల విజయ్ సేతుపతి విమర్శలను ఎదుర్కొన్నాడు. ఇంతకీ విజయ్ సేతుపతి ఎందుకు విమర్శలను ఎదుర్కొన్నాడనే వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం విజయ్ సేతుపతి 'పొన్రం' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్‌లో విజయ్ సేతుపతి పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఇందులో కేక్‌లో చాకుతో కాకుండా పెద్ద కత్తితో కట్ చేశాడు మన మక్కల్ సెల్వన్ . అయితే ఈ చర్యను కొందరు తప్పు పట్టారు. రౌడీ, గూండాలా కత్తితో కేక్ కట్ చేయడమేంటని విమర్శించారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
అయితే తనపై వస్తున్న విమర్శలకు విజయ్‌సేతుపతి వివరణను ఇచ్చుకున్నాడు. తాను ప్రస్తుతం నటిస్తోన్న 'పొన్రం' సినిమాలో కత్తి కీలక పాత్ర పోషిస్తుందని, అందువల్ల ఆ కత్తితో కేక్‌ను కట్ చేశానే తప్ప, మరో ఉద్దేశం లేదని, కేక్‌ను అలా కట్ చేసినందుకు క్షమాపణలు చెబుతున్నానని చెప్పాడు విజయ్ సేతుపతి. తనపై వస్తున్న విమర్శలకు విజయ్ సేతుపతి క్షమాపణలు చెప్పి హుందాగా ప్రవర్తించాడని అందరూ మక్కల్ సెల్వన్‌ను అభినందిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com