అందుకే ‘పుష్ప’ నుంచి తప్పుకున్నా: విజయ్ సేతుపతి
Send us your feedback to audioarticles@vaarta.com
నటనతో అభిమానులను సంపాదించుకునే హీరోలు చాలా తక్కువగా ఉంటారు. వారిలో కోలివుడ్ స్టార్ విజయ్ సేతుపతి ఒకరు. ఈ స్టార్ హీరోకి తమిళ్‌లోనే కాదు.. తెలుగులోనూ అభిమానులు ఎక్కువే. క్లాస్, మాస్ ఏ క్యారెక్టర్‌లో అయినా అద్భుతంగా ఒదిగిపోతాడు విజయ్. అయితే సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
మొదట ఈ చిత్రానికి కమిట్ అయిన విజయ్ సేతుపతి తరువాత తప్పుకున్నాడు. దీనిపై తాజాగా విజయ్ క్లారిటీ ఇచ్చాడు. కాల్‌షీట్లు ఖాళీగా లేకపోవడం వల్లే సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని.. ఈ విషయాన్ని డైరెక్టుగా సుక్కుని కలిసి వివరించినట్టు విజయ్ తెలిపాడు. ఇప్పటికే కరోనా కారణంగా చాలా లేటు అయిన సినిమా తన డేట్స్ కారణంగా మరింత లేటు కాకూడదనే సినిమా నుంచి తప్పుకున్నట్టు విజయ్ సేతుపతి వివరించాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments