బాలీవుడ్ నిర్మాణ సంస్థకి నో చెప్పిన విజయ్
Send us your feedback to audioarticles@vaarta.com
పెళ్ళి చూపులుతో కథానాయకుడిగా తొలి విజయాన్ని అందుకున్నాడు విజయ్ దేవరకొండ. అయితే ఆ తరువాత వచ్చిన అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండ ఏ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న యువ కథానాయకుల్లో విజయ్ ముందు వరుసలో ఉంటారంటే అతిశయోక్తి కాదు.
కొత్త దర్శకులతో పాటు సక్సెస్‌ఫుల్ డైరెక్టర్స్‌తోనూ ఆయన సినిమాలు చేస్తున్నారు. అర్జున్ రెడ్డితో కేవలం తెలుగులోనే కాదు.. ఇతర పరిశ్రమల దృష్టిని కూడా ఆయన ఆకట్టుకున్నారు. అందుకే.. విజయ్ క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ హిందీ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ మూడు చిత్రాలను నిర్మించేందుకు ముందుకొచ్చిందట. అయితే.. విజయ్ మాత్రం ఈ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించాడట. విజయ్ నో చెప్పడానికి ఓ రీజన్ ఉందంట. ఇంతకీ అదేమిటంటే.. ఈ మూడు చిత్రాలు పూర్తయ్యే వరకు మరో సినిమా చేయకూడదని యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రతిపాదించిందట. దాంతో.. విజయ్ ఈ క్రేజీ ఆఫర్ వద్దనుకున్నాడట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com