'సర్కార్' చిత్రీకరణ పూర్తి
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న కొత్త చిత్రానికి `సర్కార్` అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఎ.ఆర్.మురుగదాస్ దర్శకుడు. కీర్తిసురేశ్ హీరోయిన్‌గా నటిస్తుంది. వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో నటిస్తుంది. `తపాకీ`, `కత్తి` సినిమాల తర్వాత విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రమిది. ఇందులో కూడా రాజకీయ నేపథ్యం ఉంటుంది.
ఇందులో విజయ్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన ప్యాచ్ వర్క్ సహా చిత్రీకరణంతా పూర్తయ్యింది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మాత్రం బ్యాలెన్స్ ఉంది. ఆ పనులు జరుగుతున్నాయి. దీపావళి సందర్భంగా సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందించిన పాటలను అక్టోబర్ 2న విడుదల చేస్తున్నారు. కీర్తిసురేశ్, వరలక్ష్మి శరత్ కుమార్ నటించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments