విజయసాయి రెడ్డి నోరు అదుపులో పెట్టుకో!
Send us your feedback to audioarticles@vaarta.com
వైసీపీ కీలకనేత, ఎంపీ విజయసాయిరెడ్డికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా పవన్, సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విజయసాయి విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు కృష్ణా జిల్లాలో పెడననియోజకవర్గం జనసేన బహిరంగ సభా వేదికగా పవన్ మాట్లాడుతూ.."వైసీపీ నాయకులు విజయసాయి రెడ్డి అన్న మాటలు బాధకలిగించాయి. ప్రజా సంక్షేమం కోసం నేను మాట్లాడితే.. ఆయనేమో టీడీపీ దగ్గర డబ్బులు తీసుకున్నానని ఎగతాళిగా మాట్లాడతారు.
విజయసాయి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. డబ్బులు తీసుకుని టికెట్లు ఇవ్వడం వైసీపీకి అలవాటు ఏమో..? పవన్‌కి ఆ అలవాటు లేదు. ప్రజా సేవ చేయాలని కోట్ల సంపాదనను వదులుకొని వచ్చాను. విజయసాయిఒకటే గుర్తుపెట్టుకోండి.. పులివెందుల రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోవడానికి నేను అల్లాటప్ప వ్యక్తిని కాదు. అన్నింటికి తెగించినవాడిని. మంచిగా మాట్లాడితే మంచిగా మాట్లాడతాను. కాదు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తామంటే మాత్రం తరిమి తరిమి కొడతాం" అని పవన్ చెప్పుకొచ్చారు.
దమ్ముంటే విశాఖ వెళ్ళండి
"విజయసాయిరెడ్డి ఏమో పేపర్లు, చానళ్లు ఉన్నాయి కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోను తాట తీసి కూర్చోబెడతా. పులివెందుల వేషాలు సాగవిక్కడ. వైసీపీ నాయకులు, టీడీపీ నాయకులు జనసేనకి అభ్యర్ధులు దొరుకుతారా అని ఎగతాళి చేశారు. విజయసాయిరెడ్డి గారు చట్టాన్ని అడ్డుపెట్టుకుని ఆర్ధిక నేరాలు ఎలా చేయాలో చూపించిన మీరా మాట్లాడేది. మీలాంటి వారి కోసమే జేడీ లక్ష్మీనారాయణని తెచ్చి విశాఖలో పోటి చేయించాం. దమ్ముంటే విశాఖ వెళ్లండి.
గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన మాగంటి బాబు గారిని గెలిపిస్తే, ఆయన పార్లమెంటుకి వెళ్లి నిద్రపోతున్నారు. అందుకే కైకలూరు నుంచి ఆర్ధికవేత్త, మేధావి అయిన పుల్లారావుగారిని పార్లమెంటు అభ్యర్ధిగా బరిలోకి దించాం. కొల్లేటి సమస్యల మీద పోరాటం చేసిన వ్యక్తి ఆయన. మన సమస్యలపై పార్లమెంటులో బలంగా గళం వినిపించగలిగే వ్యక్తి. ఆలోచించి ఓటు వేయండి. మీ భవిష్యత్తు కోసం పని చేస్తా" అని కైకలూరులో జరిగిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout