'పులి' వెనుకడుగు వేసింది...
Send us your feedback to audioarticles@vaarta.com
కత్తి` చిత్రంతో తమిళనాడులో బాక్సాఫీస్ రికార్డుల్ని సృష్టించిన ఇళయదళపతి విజయ్ లేటెస్ట్ గా శింబుదేవన్ దర్శకత్వంలో ఎస్.కె.టి. స్టూడియోస్ పతాకంపై శిబు తమీన్స్, పి.టి.స్వెకుమార్ నిర్మిస్తోన్న చిత్రం పులి`. భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
ఈ సినిమాని సెప్టెంబర్ 17న రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తుకున్నారు. అయితే సీజీ వర్క్ ఇంకా పూర్తి కానుందున సినిమాని అక్టోబర్ 1న విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని ఎస్.వి.ఆర్.మీడియా బ్యానర్ పై శోభారాణి రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల తెలుగు, తమిళంలో విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కి ఆడియెన్స్ నుండి మంచి స్పందన వచ్చింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments