విజయ్..పొలిటికల్ లీడర్
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ స్టార్ హీరో విజయ్..ఇప్పుడు తెరపై పొలిటికల్ లీడర్‌గా కనపడబోతున్నాడని సమాచారం. అట్లీ దర్శకత్వంలో విజయ్ హీరోగా రూపొందుతోన్న ఈ చిత్రంలో విజయ్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. అందులో ఇంద్రజాలీకుడుగా ఒక పాత్ర చేస్తుంటే, జల్లికట్టు వీరుడిగా మరో పాత్రలో నటిస్తున్నాడు. ఇక మూడో పాత్ర ఏంటనేది చాలా రోజులుగా ఎవరికీ తెలియలేదు.
కాగా తాజా సమాచారం ప్రకారం విజయ్ మూడో పాత్ర ఏంటో తెలిసి పోయింది. అదే పొలిటికల్ లీడర్ పాత్ర. ప్రస్తుతం ఈ పాత్రకు సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. గతంలో విజయ్ తలైవా అనే సినిమాలో వర్గ నాయకుడిగా నటించడం పెద్ద దుమారమే రేపింది. మరిప్పుడు విజయ్ పొలిటికల్ లీడర్‌గా చేస్తుండటం ఎలాంటి దుమారానికి తెర తీస్తుందో చూడాలి. కాజల్ అగర్వాల్, సమంత, నిత్యామీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. థెరి(తెలుగులో పోలీసోడు) సినిమా తర్వాత అట్లీ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న చిత్రమిది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com