ఆ హీరోయిన్ విడాకుల విషయాన్ని తేల్చేసిన భర్త
Send us your feedback to audioarticles@vaarta.com
నాయక్, ఇద్దరమ్మాయిలతో, రీసెంట్ గా మేము సహా పలు చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్ అమలాపాల్ దర్శకుడు ఎ.ఎల్.విజయ్ను 2014లో పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. ఎంతో అనోన్యంగా ఉంటున్న వీరి మధ్య చెడిందని, త్వరలోనే వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారనే వార్త ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.
అయితే ఇందులో ఎంతవరకు నిజముందో తెలియలేదనుకున్న వారికి దర్శకుడు ఇన్ డైరెక్ట్ తామిద్దరం విడిపోయామనే సంగతిని ధృవపరిచాడట. తాను తన తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని చెప్పడం చూస్తుంటే విజయ్, అమలాపాల్ల విడాకులు పక్కానే అంటున్నారు. అమలాపాల్ విజయ్ను నిర్ణయాన్ని కాదని సినిమాల్లోనటించడమే వీరి మధ్య గొడవలకు కారణమని తెలుస్తుంది. విజయ్ ప్రస్తుతం అభినేత్రి సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout