విజ‌య్... ఆ సినిమా చేయ‌న‌ట్టేగా?

  • IndiaGlitz, [Saturday,October 06 2018]

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన 'నోటా' శుక్ర‌వారం విడుద‌లైంది. ఈ సినిమా త‌ర్వాత ఇంకే సినిమా ఉంటుంద‌ని ఆ మ‌ధ్య విలేక‌రులు అడిగిన ప్ర‌శ్న‌కు 'నోటా' హిట్ అయితే ఓ తెలుగు, త‌మిళ బై లింగ్వ‌ల్ సినిమాను చేస్తాన‌ని విజ‌య్ దేవ‌ర‌కొండ అన్నారు. ఓపెనింగ్స్ ప‌రంగా 'నోటా ' ఆశాజ‌న‌కంగానే విడుద‌లైన‌ప్ప‌టికీ, రివ్యూలు మాత్రం స‌రిగా లేవు. మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ వ‌చ్చింది.

దీంతో 'డియ‌ర్ కామ్రేడ్‌' త‌ర్వాత చేసే సినిమా గురించి విజ‌య్ ఇంకా ఓ కొలిక్కి రాన‌ట్టు అనిపిస్తోంది. 'నోటా ' ఆడితే బై లింగ్వ‌ల్ ప్లాన్ చేయొచ్చ‌నుకున్న విజ‌య్ ఇప్పుడు ఎలాంటి సినిమా చేస్తారో వేచి చూడాల్సిందే. ఆయ‌న న‌టించిన 'నోటా' త‌మిళ‌నాడు రాజ‌కీయాల‌ను ఆధారంగా చేసుకుని రూపొందింది. ఈ సినిమాతోనే విజ‌య్ 'కింగ్ ఆఫ్ ద హిల్‌' అని కొత్త బ్యాన‌ర్‌ను మొద‌లుపెట్టిన విష‌యం తెలిసిందే.

More News

'ఘంటసాల ది గ్రేట్' పేరుతో బయోపిక్

ఈరోజుల్లో బయోపిక్స్ అనేవి ఇండియన్ సినిమాకు కొత్త ట్రెండ్. నెమ్మదిగా ఇవి ప్రేక్షకుల అభిరుచిని మార్చేస్తున్నాయనిపిస్తుంది.

తాప్సీ మ‌న‌శ్శాంతికి కార‌ణం అదే!

మ‌న‌సులో ఒక‌టి పెట్టుకుని పైకి మ‌రొక‌టి మాట్లాడ‌టం నాకు చేత‌కాదు. అందుకే ఎప్పుడైనా నాకు ఏద‌నిపిస్తే అది మాట్లాడుతాను.

హీరోగా ఫైట్ మాస్ట‌ర్

డైర‌క్ట‌ర్ కుర్చీ మీద‌, హీరో క్రేజ్ మీదా ప్ర‌తి ఒక్క‌రికీ ఏదో ఒక‌ర‌క‌మైన ప్యాష‌న్ ఉంటుంది. ఎంతో మంది డ్యాన్స్ డైర‌క్ట‌ర్లు, ద‌ర్శ‌కులు అవుతున్నారు.

సినిమాటోగ్రఫీ మంత్రి తలసానికి మనం సైతం బర్త్ డే సెలబ్రేషన్స్

ప్రముఖ నటులు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనం సైతం సేవా సంస్థ తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించింది.

కొత్త ఒర‌వ‌డికి సిద్ధ‌మంటున్న తార‌క్

రాజమౌళి సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ అన్నీ ఆయ‌నే ఇస్తే బావుంటుంద‌ని అంటున్నారు ఎన్టీఆర్‌. చ‌ర‌ణ్‌తో క‌లిసి న‌టించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు.