విజయ్... ఆ సినిమా చేయనట్టేగా?
Send us your feedback to audioarticles@vaarta.com
విజయ్ దేవరకొండ నటించిన `నోటా` శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా తర్వాత ఇంకే సినిమా ఉంటుందని ఆ మధ్య విలేకరులు అడిగిన ప్రశ్నకు `నోటా` హిట్ అయితే ఓ తెలుగు, తమిళ బై లింగ్వల్ సినిమాను చేస్తానని విజయ్ దేవరకొండ అన్నారు. ఓపెనింగ్స్ పరంగా `నోటా ` ఆశాజనకంగానే విడుదలైనప్పటికీ, రివ్యూలు మాత్రం సరిగా లేవు. మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ వచ్చింది.
దీంతో `డియర్ కామ్రేడ్` తర్వాత చేసే సినిమా గురించి విజయ్ ఇంకా ఓ కొలిక్కి రానట్టు అనిపిస్తోంది. `నోటా ` ఆడితే బై లింగ్వల్ ప్లాన్ చేయొచ్చనుకున్న విజయ్ ఇప్పుడు ఎలాంటి సినిమా చేస్తారో వేచి చూడాల్సిందే. ఆయన నటించిన `నోటా` తమిళనాడు రాజకీయాలను ఆధారంగా చేసుకుని రూపొందింది. ఈ సినిమాతోనే విజయ్ `కింగ్ ఆఫ్ ద హిల్` అని కొత్త బ్యానర్‌ను మొదలుపెట్టిన విషయం తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com