ముగ్గురిలో విజయ్‌తో నటించబోయేది ఎవరో..!
Send us your feedback to audioarticles@vaarta.com
సంక్రాంతికి `మాస్టర్`తో సందడి చేసిన కోలీవుడ్ అగ్ర కథానాయకుడు విజయ్ నెక్ట్స్ మూవీని నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. . నెల్సన్ నయనతారతో `కోలమావు కోకిల` విడుదలై సూపర్‌హిట్ అయ్యింది. మరో వైపు శివకార్తీకేయన్‌తో చేసిన `డాక్టర్` సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అంటే ఈ రెండు సినిమాల్లోనూ విడుదలైంది ఓ సినిమానే. బడ్డింగ్ డైరెక్టర్ నెల్సన్‌కు విజయ్ అవకాశం ఇవ్వడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించనున్నారు.
అయితే హీరోయిన్గా ఎవరు నటింప చేయాలనే దానిపై దర్శక నిర్మాతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే తెలుగు, బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న పూజా హెగ్డే పేరు పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. కాగా.. ఇప్పుడు ఈ లిస్టులో ఇప్పుడు మరో ఇద్దరు హీరోయిన్స్ పేర్లు వినిపిస్తున్నాయి. వారెవరో కాదు.. కియారా అద్వాని, రష్మిక మందన్న. వీరిలో రష్మిక మందన్న ఇప్పటికే తమిళంలో కార్తితో సుల్తాన్ సినిమాలో నటించింది. కాగా.. కియారా అద్వానీని తీసుకుంటే ఆమె నటించబోయే తొలి కోలీవుడ్ మూవీ ఇదే అవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com