వివాదంలోకి హీరో విజ‌య్ సినిమా

  • IndiaGlitz, [Tuesday,September 24 2019]

త‌మిళ స్టార్ హీరో విజ‌య్‌కి వివాదాలేం కొత్త కావు..ఆయ‌న ప్ర‌తి సినిమాకు ఏదో ఒక వివాదం న‌డుస్తూనే ఉంటుంది. ఆయ‌న త‌మిళ ప్ర‌భుత్వాన్నో, కేంద్ర ప్ర‌భుత్వాన్నో విమ‌ర్శిస్తూ సినిమాలు తీయ‌డం అందుకు ప్ర‌భుత్వం త‌ర‌పును వ్య‌క్తులు సినిమాపై ఆగ్ర‌హాన్ని ప్ర‌క‌టించ‌డం సాధార‌ణంగా జ‌రుగుతూ వ‌స్తున్నాయి. ఇప్పుడు విజ‌య్ హీరోగా న‌టిస్తోన్న తాజా చిత్రం 'బిగిల్‌'. విజ‌య్‌, అట్లీ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఇటీవ‌ల విడుద‌లైన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ వివాదానికి దారి తీసింది. ఫ‌స్ట్ లుక్ మ‌త్స్య‌, మాంస వ్యాపారుల‌ను అవ‌మానించేలా ఉందంటూ కొంద‌రు విజ‌య్‌పై కోవై క‌లెక్ట‌ర్‌కు ఫిర్యాదు చేశారు.

మ‌త్స్య‌, మాంస వ్యాపారులు వృత్తి చేసే స‌మ‌యంలో ఎంతో ప‌విత్రంగా భావించే క‌త్తులుండే పీఠంపై విజ‌య్ కాలు పెట్టుకుని కూర్చున్నట్లు లుక్‌ను విడుద‌ల చేశారు. ఇది మ‌త్స్య‌, మాంస వ్యాపారుల‌ను అవ‌మానించేలా ఉంద‌ని, సినిమాలోని స‌ద‌రు స‌న్నివేశాల‌ను తొల‌గించుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న‌లు చేస్తామ‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు.

హీరో విజ‌య్ న‌టించిన త‌లైవా(అన్న‌), తెరి(పోలీస్‌), స‌ర్కార్‌, మెర్స‌ల్‌(అదిరింది) సినిమాలు కూడా విడుద‌ల ముందు వివాదాల‌కు కార‌ణ‌మ‌య్యాయి. ఇప్పుడు ఈ వ‌రుస‌లో బిగిల్ చిత్రం కూడా చేరింది. బిగిల్ చిత్రాన్ని తెలుగులో ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేశ్ కొనేరు విడుదల చేస్తున్నారు. తెలుగులో ఈ చిత్రానికి విజిల్ అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. దీపావ‌ళికి సినిమాను విడుద‌ల చేయాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావిస్తున్నారు. ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో రీసెంట్‌గా విడుద‌లైంది.

More News

'గద్దలకొండగణేష్' చిత్రాన్ని గ్రాండ్ సక్సెస్‌ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్ - మెగాప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌

మెగాప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, పవర్‌ఫుల్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ప్లస్‌ బేనర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం 'గద్దలకొండగణేష్‌'.

బాహుబ‌లిని దాటేసిన సైరా

స్టార్ హీరోల సినిమాలంటే ఎన్ని రికార్డులు క్రియేట్ అవుతాయో అని సినీ వ‌ర్గాలు.. అంద‌రి హీరోల‌ను త‌మ హీరో దాటి రికార్డులు క్రియేట్ చేయాల‌ని అభిమానులు భావిస్తుంటారు.

చిరు ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటాం.. ‘సైరా’ రిలీజ్‌ను ఆపేస్తాం’

‘సైరా’ సినిమాపై రాజుకున్న వివాదానికి ఇప్పట్లో ఫుల్‌స్టాప్ పడే అవకాశాలు కనిపించట్లేదు. సైరా నర్సింహారెడ్డి కథ వాడుకున్నందుకు గాను ఇచ్చిన మాట ప్రకారం తమకు డబ్బులు చెల్లించాలని వారసులు..

కేసీఆర్-వైఎస్ జగన్ ఏం చర్చించారు!?

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి, కేసీఆర్‌లు సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో భేటి అయ్యారు.

సెన్సార్ పూర్తి చేసుకున్న `సైరా న‌ర‌సింహారెడ్డి`

ఎప్పుడెప్పుడా అని ఆతృత‌గా మెగాభిమానులు ఎదురుచూస్తున్న చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి`.