ఫస్ట్ లుక్ : విజయ్ మైండ్ బ్లోయింగ్ లుక్.. కొత్త సినిమా టైటిల్ ఇదే!
Send us your feedback to audioarticles@vaarta.com
ఇళయదళపతి విజయ్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. తమిళనాట అతడి బాక్సాఫీస్ ప్రభంజనం గురించి ప్రతి ఒక్క టాలీవుడ్ అభిమాని గుర్తెరిగే ఉంటారు. తెలుగులో కూడా విజయ్ క్రేజ్ క్రమంగా పెరుగుతోంది. తన స్టైల్, నటన ఆటిట్యూడ్ తో విజయ్ కోట్లాది అభిమానులకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: పిక్ టాక్: పూజా హెగ్డే యోగాసనాలు.. ప్రతి భంగిమలో హాట్ నెస్
విజయ్ చివరగా మాస్టర్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. అయితే విజయ్ 65వ చిత్రం ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది. జూన్ 22 అంటే మంగళవారం విజయ్ పుట్టినరోజు ఈ సందర్భంగా ఫస్ట్ లుక్, టైటిల్ ప్రకటించారు.
విజయ్ 65వ చిత్ర టైటిల్ 'బీస్ట్'గా ఖరారైంది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో విజయ్ కిల్లింగ్ లుక్ తో అదరగొడుతున్నాడు. చేతిలో స్టైలిస్ట్ గన్ పట్టుకుని షర్ట్ లేకుండా బనియన్ తో ఉన్న విజయ్ లుక్ అద్భుతంగా ఉంది.
నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యంగ్ సెన్సేషన్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. విజయ్ 'బీస్ట్' ఫస్ట్ లుక్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఈ చిత్రంలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.
త్వరలో విజయ్ తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించనున్నారు. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com