‘మాస్టర్’కి షాక్.. ఆన్‌లైన్‌లో లీక్..!
Send us your feedback to audioarticles@vaarta.com
కోలీవుడ్ అగ్ర హీరోల్లో విజయ్‌కి షాకులు మీద షాకులు తగులుతున్నాయి. ఆయన టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘మాస్టర్’ ఆన్‌లైన్‌లో లీకైంది. ఈ ఘటనతో మొత్తం కోలీవుడ్ ఇండస్ట్రీ షాకైంది. ‘మాస్టర్’ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. వెంటనే చిత్ర యూనిట్ సహా చిత్రపరిశ్రమ అంతా దిద్దుబాటు చర్యలను స్టార్ట్ చేసింది. దర్శకుడు లోకేశ్ కనకరాజ్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్, హీరోయిన్ మాళవికా మోహనన్ అందరూ ... ఆన్‌లైన్‌లో లీకైన సన్నివేశాలను బయట స్పెడ్ కానీయకుండా చూడాలని, షేర్ చేయవద్దంటూ ఫ్యాన్స్, అభిమానులను రిక్వెస్ట్ చేశారు. సినిమా చూడటానికి ఓ రోజు మాత్రమే మిగిలి ఉందని, వెయ్యి మంది కష్టం..ఏడాదిన్నర పాటు పడ్డ శ్రమను ఆన్‌లైన్ చూస్తే అమానించినట్లే అవుతుందని చిత్రయూనిట్ ప్రేక్షకులు, ఫ్యాన్స్‌ను రిక్వెస్ట్ చేసింది.
విజయ్‌కి ఉన్న ఫ్యాన్ బేస్, ఆయన సినిమాలకు ఉండే కలెక్షన్సే వేరు. ఆదరణే వేరు. ఈయన లేటెస్ట్ మూవీ 'మాస్టర్'. నగరం, ఖైదీ చిత్రాల దర్శకుడు లొకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించారు. గత ఏడాది సమ్మర్‌కు విడుదల కావాల్సిన ఈ చిత్రం కోవిడ్ ప్రభావంతో వాయిదా పడింది. థియేటర్స్ యాబై శాతం ఆక్యుపెన్సీతో ఓపెన్ కావడంతో సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయడానికి నిర్మాతలు సిద్ధమయ్యారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments