వరుణ్‌తేజ్‌తో విజయ్‌కుమార్ కొండా
Send us your feedback to audioarticles@vaarta.com
`గుండెజారి గల్లంతయ్యిందే` సూపర్‌హిట్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్ విజయ్‌కుమార్ కొండా నెక్ట్స్ నాగచైతన్యతో `ఒక లైలా కోసం` అనే ప్రేమకథను తెరకెక్కించాడు. ఈ రెండు సినిమాలు తర్వాత విజయ్‌కుమార్ కొండా గ్యాప్ తీసుకున్నాడు. నితిన్‌తో `గుండెజారి గల్లంతయ్యిందే` సీక్వెల్ తెరకెక్కించే ప్రయత్నాలు చేశాడు. ఈ విషయాన్ని నితిన్ కూడా తెలియజేశాడు.
అయితే కారణాలు తెలియరాలేదు కానీ ఇప్పుడు విజయ్‌కుమార్ కొండా వరుణ్‌తేజ్ హీరోగా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ మిస్టర్, ఫిదా సినిమాల చిత్రీకరణతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాల తర్వా అంటే ఈ ఏడాది చివరన కానీ, వచ్చే ఏడాది కానీ సినిమా సెట్స్‌లోకి వెళ్లే అవకాశం ఉందని ఫిలింనగర్ వర్గాల సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments