వ‌రుణ్‌తేజ్‌తో విజ‌య్‌కుమార్ కొండా

  • IndiaGlitz, [Saturday,September 17 2016]

'గుండెజారి గ‌ల్లంత‌య్యిందే' సూప‌ర్‌హిట్‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన డైరెక్ట‌ర్ విజ‌య్‌కుమార్ కొండా నెక్ట్స్ నాగ‌చైత‌న్య‌తో 'ఒక లైలా కోసం' అనే ప్రేమ‌క‌థ‌ను తెర‌కెక్కించాడు. ఈ రెండు సినిమాలు త‌ర్వాత విజ‌య్‌కుమార్ కొండా గ్యాప్ తీసుకున్నాడు. నితిన్‌తో 'గుండెజారి గ‌ల్లంత‌య్యిందే' సీక్వెల్ తెర‌కెక్కించే ప్ర‌య‌త్నాలు చేశాడు. ఈ విష‌యాన్ని నితిన్ కూడా తెలియ‌జేశాడు.

అయితే కార‌ణాలు తెలియ‌రాలేదు కానీ ఇప్పుడు విజ‌య్‌కుమార్ కొండా వరుణ్‌తేజ్ హీరోగా తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ప్ర‌స్తుతం వరుణ్ తేజ్ మిస్ట‌ర్‌, ఫిదా సినిమాల చిత్రీక‌ర‌ణ‌తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాల త‌ర్వా అంటే ఈ ఏడాది చివ‌ర‌న కానీ, వ‌చ్చే ఏడాది కానీ సినిమా సెట్స్‌లోకి వెళ్లే అవ‌కాశం ఉందని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం.

More News

విడాకులు తీసుకుంటున్న సౌంద‌ర్య ర‌జ‌నీకాంత్‌...

సూప‌ర్ స్టార్ త‌న‌య సౌంద‌ర్య ర‌జ‌నీకాంత్ 2010లో అశ్విన్‌కుమార్ అనే బిజినెస్ మ్యాన్‌ను వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాది వీరికి ఓ బాబు కూడా పుట్టాడు. అయితే కార‌ణాలు తెలియ‌డం లేదు కానీ వీరి మ‌ధ్య విబేదాలు త‌లెత్తాయి.

ఆయ‌న‌కు నేష‌న‌ల్ అవార్డ్ రావాలి - నాగ్

కింగ్ నాగార్జున నేష‌న‌ల్ అవార్డ్ రావాలి అని కోరుకుంటుంది ఎవ‌రికి అనుకుంటున్నారా...? విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ కి. స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌కాష్ రాజ్ తాజాగా మ‌న ఊరి రామాయ‌ణం చిత్రాన్ని తెర‌కెక్కించారు.

కింగ్ నాగార్జున చేతుల మీదుగా మ‌న ఊరి రామాయ‌ణం ఆడియో విడుద‌ల‌

జాతీయ ఉత్తమనటుడు ప్రకాష్ రాజ్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ రూపొందించిన‌ ద్విభాషా చిత్రం మన ఊరి రామాయణం.  ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, ప్రియమణి, సత్యదేవ్, పృథ్వీ, రఘుబాబు ప్రధాన పాత్ర‌లు పోషించారు.

వైజాగ్ లో ఈనెల 17న డా.మంచు మోహ‌న్ బాబు 40 న‌ట వ‌సంతాల వేడుక‌కు భారీ ఏర్పాట్లు

సాధారణ వ్యక్తిగా తెలుగు ఇండస్ట్రీలోకి ప్రవేశించిన కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు అంచెలంచెలుగా ఎదిగి ఉన్నతి శిఖరాలను అధిరోహించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అభిమాన నటుడయ్యారు. నటజీవితంలో నలభై వసంతాలను పూర్తి చేసుకుని ఈతరం నటులకు ఆదర్శప్రాయంగా నిలిచారు.

హైపర్‌ ఫస్ట్‌ సాంగ్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌, టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సంతోష్‌ శ్రీన్‌వాస్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ హైప‌ర్ (ప్ర‌తి ఇంట్లో ఒక‌డుంటాడు).