విజయ్ 'సర్కార్'
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న కొత్త చిత్రానికి `సర్కార్` అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఎ.ఆర్.మురుగదాస్ దర్శకుడు. జూన్ 22న విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను.. విజయ్ లుక్‌ను నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ విడుదల చేసింది. సరికొత్త విజయ్ లుక్‌కి అభిమానులు, ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. కీర్తిసురేశ్ హీరోయిన్‌గా నటిస్తుంది.
వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో నటిస్తుంది. `తపాకీ`, `కత్తి` సినిమాల తర్వాత విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రమిది. ఇందులో కూడా రాజకీయ నేపథ్యం ఉంటుందని తమిళ సినీ వర్గాలు అంటున్నాయి. దీపావళి సందర్భంగా సినిమాను విడుదల చేయాలని నిర్మాణ సంస్థ భావిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com