ముఖ్యమంత్రి పాత్రలో విజయ్
- IndiaGlitz, [Saturday,September 01 2018]
తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న కొత్త చిత్రానికి 'సర్కార్' అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఎ.ఆర్.మురుగదాస్ దర్శకుడు. కీర్తిసురేశ్ హీరోయిన్గా నటిస్తుంది. వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో నటిస్తుంది. 'తపాకీ', 'కత్తి' సినిమాల తర్వాత విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రమిది. ఇందులో కూడా రాజకీయ నేపథ్యం ఉంటుంది.
అందులో భాగంగా విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తారట. విజయ్‌కు మంచి మాస్ ఇమేజ్ ఉంది. ఆయన రాజకీయాల్లోకి వస్తారని గట్టిగా వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలోఇలాంటి పాత్ర చేయనున్నాడని వార్తలు రావడం హాట్ టాపిక్‌గా మారింది. దీపావళి సందర్భంగా సినిమాను విడుదల చేయాలని నిర్మాణ సంస్థ భావిస్తోంది.