ఏఎన్నార్ పాత్రలో విజయ్....
- IndiaGlitz, [Wednesday,November 08 2017]
'మహానటి' సినిమా శరవేగంగా చిత్రీకరణను జరుపకుంటుంది. నాగ అశ్విన్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో అలనాటి మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుంది.
ఎస్వీఆర్ పాత్రలో మోహన్‌బాబు, నాగిరెడ్డి పాత్రలో క్రిష్, సింగీతం శ్రీనివాసరావు పాత్రలో తరుణ్ భాస్కర్లు నటిస్తుండగా, చక్రపాణి పాత్రలో ప్రకాష్ రాజ్ నటిస్తాడని వార్తలు వచ్చాయి.
అయితే సినిమాలో ముందు నుండి ఆసక్తిని రేపుతున్న రెండు పాత్రలు ఎన్టీఆర్, ఏఎన్నార్లవే. ముందు ఈ పాత్రల్లో జూనియర్ ఎన్టీఆర్, నాగచైతన్యలు నటిస్తారని న్యూస్ వినపడింది.
తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఏఎన్నార్ పాత్రలో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడట. మరి ఎన్టీఆర్ పాత్రలో ఎవరు నటించనున్నారో తెలియడం లేదు.